
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ మరో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య ఇండోర్ వేదికగా రెండో టీ20 శుక్రవారం జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో ధోని ఒక క్యాచ్ పడితే టీ20ల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్ కీపర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం 133 క్యాచ్‌లతో శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కరతో ధోని సమానంగా ఉన్నాడు.
ఈ జాబితాలో భారత్‌కు దినేశ్ కార్తీక్ (121) క్యాచ్‌లతో రెండో స్ధానంలో నిలవగా, పాకిస్థాన్‌కు చెందిన కమ్రాన్ అక్మల్ (115) క్యాచ్‌లతో మూడో స్ధానంలో కొనసాగుతున్నాడు. కాగా, మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
కటక్ వేదికగా జరిగిన తొలి టీ20లో ధోని ఇప్పటికే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. తొలి టీ20లో ధోని చేసిన 39 పరుగులు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ధోని సాధించిన పరుగుల సంఖ్య 1,320కి చేరింది.
దీంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు. తొలి టీ20లో తన అద్భుతమైన కీపింగ్‌తో నలుగురిని పెవిలియన్‌కు చేర్చిన సంగతి తెలిసిందే. దీంతో టీ20 క్రికెట్లో అత్యధిక ఔట్లలో పాలుపంచుకున్న వికెట్‌కీపర్ లేదా ఫీల్డర్‌గా ధోని ప్రపంచ రికార్డు సృష్టించాడు.
తొలి టీ20లో నాలుగు ఔట్లు చేసిన తొలి వికెట్ కీపర్‌గా ధోని చరిత్ర సృష్టించాడు. లంకతో తొలి టీ20లో ధోని రెండు క్యాచ్‌లు అందుకోవడంతో పాటు రెండు స్టంప్‌లు చేశాడు. 74 ఔట్లలో పాలుపంచుకున్న అతడు డివిలియర్స్ రికార్డు (72)ను అతడు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.