మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ట్వంటీ 20 తొలి రెండు మ్యాచులలోను బ్యాటింగ్ చేసేందుకు యువరాజ్ సింగ్‌కు అవకాశం రాలేదు. చాలా రోజుల అనంతరం యువరాజ్‌కు భారత జట్టులో చోటు దక్కింది. కానీ తొలి రెండు ట్వంటీ 20లలో బ్యాటింగ్ రాలేదు.
దీనిపై క్రికెట్ అభిమానులు కొందరు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో సెటైర్లు వేస్తున్నారు. ముఖ్యంగా యువీ తండ్రి యోగరాజ్ సింగ్‌కు చురకలు అంటిస్తున్నారు. తొలి ట్వంటీ 20 జనవరి 26న జరిగింది. తొలి మ్యాచులో భారత్ 37 పరుగుల తేడాతో ఆసిస్ పైన గెలిచింది.
అప్పుడు కూడా యువరాజ్ బ్యాటింగ్ చేయలేదు. దీనిపై ధోనీ మాట్లాడుతూ.. యువీకి ప్రాక్టీస్ లేనందున తాను ముందుగా వచ్చానని చెప్పాడు. అలాగే శుక్రవారం నాడు రెండో మ్యాచులోను యువీకి బ్యాటింగ్ రాలేదు. దీని పైనే ట్విట్టర్లో చురకలు కనిపిస్తున్నాయి. ఓ అభిమాని.. యువీకి బ్యాటింగ్ ఇవ్వడం లేదంటూ అతని తండ్రి యోగ్‌రాజ్.. ధోనీ పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఎద్దేవా చేశాడు. ఇవీ ట్వీట్లు...