Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2వ వన్డే: ధోనీ దంచినా దక్షిణాఫ్రికానే గెలిచింది, క్లాసెన్ కుమ్మేశాడు

2nd T20I: Klaasen, Duminy power South Africa to 6-wicket win over India; keep series alive

హైదరాబాద్: భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన రెండో టీ20లో సఫారీ జట్టు పుంజుకుంది. సెంచూరియన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఆ జట్టు ఘన విజయం సాధించింది. ధోనీ హాఫ్ సెంచరీ జట్టుకు బలం చేకూర్చలేకపోయింది.

మ్యాచ్ స్కోరు కార్డు, పూర్తి షెడ్యూల్ వివరాల కోసం:

వాతావరణం బాగానే కలిసొచ్చి:

వాతావరణం బాగానే కలిసొచ్చి:

189పరుగుల లక్ష్యంతో అడుగుపెట్టిన సఫారీలు క్లాసన్‌తో పాటు డుమిని విరుచుకుపడడంతో లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వాతావరణం కూడా బాగానే కలిసొచ్చి సఫారీలకు లక్ష్య చేధనలో అడ్డు లేకుండా పోయింది. చివరిదైన మూడో టీ20 శనివారం కేప్‌టౌన్‌లో జరుగుతుంది.

కాసేపటికే వెన్నుచూపిన రోహిత్:

కాసేపటికే వెన్నుచూపిన రోహిత్:

భారత బ్యాట్స్‌మెన్‌లైన ప్రధాన వికెట్లు 38 పరుగులకే రెండు వికెట్లు పడిపోయాయి. యథావిధిగా రోహిత్ వచ్చిన కాసేపటికే వెన్నుచూపి పెవిలియన్ చేరుకుంటే, విరాట్ కోహ్లీ సైతం కేవలం 1 పరుగుకే పరిమితమై క్రీజును వదిలిపెట్టాడు. అనంతరం వచ్చిన మనీష్‌ పాండే 6 ఫోర్లు, 3 సిక్సులతో (79), ధోని (52) తీవ్రంగా శ్రమిస్తే భారత జట్టు 4 వికెట్ల నష్టంతో 188 పరుగులు సాధించింది.

పాండే, ధోనీల మెరుపులే:

పాండే, ధోనీల మెరుపులే:

తక్కువ స్కోరుకే మూడు కీలక వికెట్లు కోల్పోయినా భారత్‌ భారీ స్కోరు చేసిందంటే ప్రధాన కారణం మనీష్‌ పాండే, ధోనీల మెరుపులే. విధ్వంసక బ్యాటింగ్‌తో ఐదో వికెట్‌కు 98 పరుగుల అభేద్య భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జంట దక్షిణాఫ్రికాకు మంచి లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు భారత్‌ ఇన్నింగ్స్‌ పేలవంగా ఆరంభమైంది.

రెండో ఓవర్లో డాలాకు వికెట్ల ముందు:

రెండో ఓవర్లో డాలాకు వికెట్ల ముందు:

పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ రోహిత్‌.. ఖాతా అయినా తెరవకుండానే నిష్క్రమించాడు. రెండో ఓవర్లో డాలాకు వికెట్లకు ముందు దొరికిపోయాడు. జట్టు స్కోరు అప్పటికి ఒక్కటే. కానీ ఒక్కసారిగా విరుచుకుపడ్డ ధావన్‌.. మోరిస్‌ వేసిన మూడో ఓవర్లో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లతో ఇన్నింగ్స్‌కు ఊపుతెచ్చాడు. ప్యాటర్సన్‌ ఓవర్లో రైనా కూడా మూడు ఫోర్లు బాదడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.

కోహ్లీ ఔట్ తర్వాత కాసేపు ప్రశాంతం:

కోహ్లీ ఔట్ తర్వాత కాసేపు ప్రశాంతం:

కానీ ధావన్‌ (24), కోహ్లి వరుస ఓవర్లలో ఔట్‌ కావడంతో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ధావన్‌.. డుమిని బౌలింగ్‌లో ఫుల్‌టాస్‌ బంతిని మిడాన్‌లో ఆడే ప్రయత్నంలో బెహార్డీన్‌కు చిక్కాడు. ఇక కోహ్లి (1) డాలా బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ క్లాసన్‌ చేతికి చిక్కాడు. ఆరో ఓవర్లో కోహ్లి ఔటయ్యేటప్పటికి స్కోరు 45. ఆ తర్వాత కాసేపు పరుగుల వేగం తగ్గింది.

కళ్లు చెదిరే సిక్స్‌లు:

కళ్లు చెదిరే సిక్స్‌లు:

ఐతే నెమ్మదిగా ఇన్నింగ్స్‌ ఆరంభించిన పాండే క్రమంగా మోత మొదలెట్టాడు. 9వ ఓవర్లో తన తొలి బౌండరీ సాధించిన పాండేకు ఆ తర్వాత అడ్డమే లేకుండా పోయింది. క్లియర్ షాట్లతో విరుచుకుపడి.. శంసి ఓవర్లో స్లాగ్‌ స్వీప్‌లతో మిడ్‌వికెట్లో రెండు కళ్లు చెదిరే సిక్స్‌లు కొట్టాడు. 24 బంతుల్లో రైనా (31) ఆడి ఔటయినా దక్షిణాఫ్రికాకు పెద్దగా దక్కిందేమీ లేదు. డాలా బౌలింగ్‌లో వరుసగా రెండు బంతులను బౌండరీ దాటించిన పాండే.. ఫెలుక్వాయో బౌలింగ్‌లో సింగిల్‌తో అర్ధశతకం (33 బంతుల్లో) పూర్తి చేశాడు. మరోవైపు క్రీజులోకి వచ్చిన ధోని కూడా, కొన్ని బంతులు ఆడాక జోరందుకున్నాడు.

నిర్దాక్షిణ్యంగా దాడి చేసి:

నిర్దాక్షిణ్యంగా దాడి చేసి:

పాండేతో బాదుడులో పోటీపడ్డాడు. చివర్లో మరింత నిర్దాక్షిణ్యంగా దాడి చేశాడు. మోరిస్‌ వేసిన 19వ ఓవర్లో సిక్స్‌, ఫోర్‌ బాదిన అతడు.. ఆఖరి ఓవర్లో (ప్యాటర్సన్‌) వరుసగా 6,4,4 దంచేశాడు. ఆ క్రమంలో ధోని 27 బంతుల్లో అర్ధసెంచరీ కొట్టాడు. టీ20 క్రికెట్లో అతడికిది రెండో అర్ధశతకం మాత్రమే. ఆఖరి 5 ఓవర్లలో భారత్‌ 64 పరుగులు పిండుకుంది. డాలా 28 పరుగులిచ్చి2 వికెట్లు తీశాడు.

Story first published: Thursday, February 22, 2018, 10:06 [IST]
Other articles published on Feb 22, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+