For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చతికిలపడ్డ కంగారూలు: సిరీస్ భారత్ కైవసం

By Pratap

మెల్బోర్న్: భారత్ తో జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచులో 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కంగారూలు చతికిలపడ్డారు. భారత్ 27 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించి మూడు మ్యాచులో సిరీస్ ను ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆరోన్ ఫించ్ ధాటిగానే ప్రారంభించినప్పటికీ మిగతా బ్యాట్స్ మెన్ ఎవరూ భారత బౌలింగు ముందు నిలదొక్కుకోలేకపోయారు.

భారత బౌలర్లలో బుమ్రాహ్, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించారు. అశ్విన్, పాండ్యా, యువరాజ్ సింగ్ తలో వికెట్ తీసుకున్నారు. 74 పరుగులు చేసిన ఫించ్ ను జడేజా విసిరిన బంతిని ధోనీ రన్నవుట్ చేయడం ద్వారా మ్యాచ్ పూర్తిగా భారత్ వైపు తిరిగింది.

2nd T20I: Australia opt to bowl first against India at MCG

భారత్ తన ముందు ఉంచి 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా 99 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. ఆరోన్ ఫించ్ ధాటిగా ఆడుతూ అర్థ సెంచరీ పూర్తి చేశాడు. పాండ్యా బౌలింగులో లైన్ రెండు పరుగులు మాత్రమే చేసి రెండో వికెట్ గా వెనుదిరిగాడు. యువరాజ్ సింగ్ మాక్స్ వెల్ వికెట్ తీశాడు. దీంతో ఆస్ట్రేలియా 101 పరుగులకు మూడో వికెట్ కోల్పోయింది.

121 పరుగుల వద్ద ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగులో వాట్సన్ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. ఎట్టకేలకు ఆరోన్ ఫించ్ 74 పరుగులు చేసి రన్నవుట్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 124 పరుగులవద్ద ఐదో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగులో ఫౌల్కనర్ 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ కావడంతో ఆస్ట్రేలియా 137 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది.

2nd T20I: Australia opt to bowl first against India at MCG

ఆస్ట్రేలియాపై రెండో 20ట్వంటీ మ్యాచులో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (59) అర్థ సెంచరీలతో భారత్ భారీ స్కోరును సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మాక్స్‌వెల్, టైలకు చెరో వికెట్ దక్కింది. 152 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఏడో వికెట్ ను జారవిడుచుకుంది. హాస్టింగ్స్ బుమ్రావ్ బౌలింగులో 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.

భారత్ 181 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. నిర్ణీత 20 ఓవర్లకు అప్పటికి ఒక్క బంతి మాత్రమే మిగిలి ఉంది. కెప్టెన్ ధోనీ 14 పరుగులు చేసి టై బౌలింగులో అవుటయ్యాడు. భారత్ 143 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 47 బంతుల్లో 60 పరుగులు చేసి రోహిత్ శర్మ రన్నవుట్ అయ్యాడు.

2nd T20I: Australia opt to bowl first against India at MCG

ఆస్ట్రేలియాతో శుక్రవారంనాడు జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచులో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ అర్థ సెంచరీ మిస్సయ్యాడు. 42 పరుగులు చేసి మాక్స్‌వెల్ బౌలింగులో అవుటయ్యాడు. దీంతో భారత్ 97 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.

రెండో ట్వంటీ20 మ్యాచులో శుక్రవారంనాడు ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లకు విశ్రాంతి ఇచ్చింది. రేపు జనవరి 30వ తేదీన వారు న్యూజిలాండ్‌కు వెళ్లాల్సి ఉండడంతో వారికి విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది.

2nd T20I: Australia opt to bowl first against India at MCG

ఇదే మైదానంలో శుక్రవారం ఉదయం భారత మహిళా క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా మహిళల జట్టుపై రెండో ట్వంటీ20 మ్యాచును గెలించింది. భారత పురుషుల క్రికెట్ జట్టు తొలి ట్వంటీ20 మ్యాచును గెలుచుకుంది. దీంతో మూడు మ్యాచులో సిరీస్‌లో 1-0 స్కోరుతో ముందంజలో ఉంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+