విజయ్ శంకర్‌కు ఆఖరి ఓవర్.. ధోని ఇచ్చిన ఐడియానే: కోహ్లీ

హైదరాబాద్: నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన రెండో వన్డేలో టీమిండియా 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయడంతో 251 పరుగుల విజయ లక్ష్యాన్ని కాపాడుకుంది. ఫలితంగా ఐదు వన్డేల సిరిస్‌లో టీమిండియా 2-0 ఆధిక్యంలో నిలిచింది.
ఈ మ్యాచ్‌లో ఆసీస్ విజయానికి చివరి 18 బంతుల్లో 21 పరుగులు అవసరం కాగా.. ఆ జట్టు చేతిలో రెండు వికెట్లే ఉన్నాయి. అయితే, క్రీజులో అప్పటికే మార్కస్ స్టోయినిస్ 52 పరుగులతో కుదురుకోవడంతో భారత్ ఓటమి ఖాయమని అనుకున్నారంతా. ఇన్నింగ్స్ 48వ ఓవర్ వేసిన బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఒక ఒక్క పరుగిచ్చాడు.

ఆఖరి ఓవర్‌లో ఆసీస్ విజయానికి 11 పరుగులు
ఆ తర్వాత 49వ ఓవర్ వేసిన షమీ 9 పరుగులిచ్చాడు. దీంతో ఆస్ట్రేలియా విజయానికి 11 పరుగులు కావాలి. భారత్ నెగ్గాలంటే... 2 వికెట్లు పడాలి. అటువైపు చూస్తే క్రీజులో మార్కస్ స్టోయినిస్ (65 బంతుల్లో 52; 4 ఫోర్లు, 1 సిక్స్) అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ప్రధాన బౌలర్లు బుమ్రా (2/29), షమీ (0/60) కోటా పూర్తి కావడంతో 50వ ఓవర్‌ను మీడియం పేసర్ విజయ్ శంకర్‌తో వేయించాల్సి వచ్చింది.

భారత్ ఓటమి ఖాయమని అనుకున్నారు
ఈ పరిస్థితుల్లో అభిమానులంతా టీమిండియా ఓటమి ఖాయమే అనుకున్నారు. అయితే, విజయ్ శంకర్ ఒత్తిడిని తట్టుకుంటూ శంకర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి బంతికే అతను స్టొయినిస్‌ను ఎల్బీగా ఔట్ చేసి దాదాపుగా మ్యాచ్‌ను ముగించాడు. రివ్యూలో కూడా ఫలితం భారత్‌కే అనుకూలంగా వచ్చింది. 6 వన్డేల కెరీర్‌లో అతనికి ఇదే తొలి వికెట్ కావడం విశేషం.

స్టేడియం మొత్తం సంబరాలు
ఇక, రెండో బంతికి జంపా (2) రెండు పరుగులు తీయడంతో మళ్లీ ఏదో ఓ మూలన సందేహం. మూడో బంతి యార్కర్.. దెబ్బకు జంపా మిడిల్ వికెట్ లేచిపోయింది. ఇంకేముంది అప్పటి వరకు ఊపిరిబిగపట్టి చూసిన స్టేడియం మొత్తం సంబరాల్లో ముంచెత్తాడు. అయితే, విజయ్ శంకర్‌ని ఆఖరి ఓవర్‌లో బౌలింగ్ చేయించాలని తనకి మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సలహా ఇచ్చారని మ్యాచ్ అనంతరం కోహ్లీ వెల్లడించాడు.

మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ
మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ "ఇన్నింగ్స్ 46వ ఓవర్‌ని కేదార్ జాదవ్ లేదా విజయ్ శంకర్‌తో వేయించాలని నేను అనుకున్నా. ఇదే విషయమై ధోని, రోహిత్ శర్మతో కూడా చర్చించాను. కానీ, ధోని ఆఖరి ఓవర్ వరకూ విజయ్ శంకర్‌ని పక్కనపెట్టి బుమ్రా, షమీ బౌలింగ్‌ను కొనసాగించాలని చెప్పాడు. అప్పటికి ఆస్ట్రేలియా చేతిలో 4 వికెట్లే ఉండటంతో.. 49వ ఓవర్‌లోపు బుమ్రా, షమీ ఆ వికెట్లు పడగొడితే మ్యాచ్‌పై పట్టు సాధించొచ్చని సలహా ఇచ్చాడు. ఊహించినట్లే 46వ ఓవర్‌లో ఒక పరుగే ఇచ్చిన బుమ్రా రెండు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను భారత్‌వైపు తిప్పాడు" అని అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications