Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రహానే ఔట్: ధోనీపై సీనియర్ల అసహనం, ఘాటైన ట్వీట్లు

మీర్పూర్: భారత్ - బంగ్లాదేశ్‌ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మీర్పూర్ వేదికగా రెండో వన్డే ఆదివారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

తొలి వన్డేలో గెలిచిన ఆతిథ్య బంగ్లాదేశ్ సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది. కాగా, రెండో వన్డేలో మూడు మార్పులు చోటు చేసుకున్నాయి.

అజింక్యా రహానే, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మల స్థానంలో అంబటి రాయుడు, అక్షర్ పటేల్, ధావల్ కులకర్ణిలను జట్టులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగిది. కాగా, తొలి వన్డేలో భారత్ పరాజయం పాలైన విషయం తెలిసిందే.

 2nd ODI: Rahane, Mohit, Umesh dropped as India bat

రహనేకు చోటు దక్కకపోవడంపై ఆగ్రహం

రెండో వన్డేలో రహానేకు చోటు దక్కకపోవడం పైన పలువురు ధోనీ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్‌లో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. రహానే ఆడకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. ఆకాశ్ చోప్రా కూడా అదే రీతిలో స్పందించాడు.

అయితే, ధోనీ చేసిన మూడు మార్పులను ఊహించలేదని చెప్పిన సంజయ్ మంజ్రేకర్ వాటిని అంగీకరిస్తున్నట్లు చెప్పాడు. అంతేకాదు, రహానేను పక్కన పెట్టి రవీంద్ర జడెజాను వెనుకేసుకు రావడంపై పలువురు ప్రశ్నిస్తున్నారు. ఓ క్రికెట్ అభిమాని ఆగ్రహంతో ఓ ట్వీట్ చేశాడు. రహానే చెన్నై ఆటగాడు కాదని, అలాగే, కోహ్లీ చంచా కాదని అందుకే తీసుకోలేదని అభిప్రాయపడ్డాడు. అయినప్పటికీ రహానేకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నాడు.

బంగ్లాదేశ్ జట్టు

మోర్తజా (సారథి) తమిమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, ముష్‌ఫికుర్ రహామ్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), షకీబ్ అల్ హసన్, షబ్బీర్ రెహ్మాన్, నాసిర్ హుస్సేన్, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, రుబెల్ హోసేన్

భారత జట్టు

రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, ధోనీ (సారథి అండ్ వికెట్ కీపర్), అంబటి రాయుడు, రవీంద్ర జడెజా, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, ధవల్ కులకర్ణి, అక్షర్ పటేల్

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+