Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెండో వన్డేలో రహానే సెంచరీ: మెరిసిన కుల్దీప్, విండిస్‌పై భారత్ ఘన విజయం

హైదరాబాద్: వెస్టిండిస్‌తో ఆదివారం జరిగిన రెండో వన్డేలో కోహ్లీ సేన ఘన విజయం సాధించింది. 311 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్‌.. భారత్‌ బౌలర్ల దెబ్బకు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. దీంతో వెస్టిండిస్‌పై టీమిండియా 105 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

తొలి వన్డే వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. రెండో వన్డేలో భారత్ విజయం సాధించడంతో ఐదు వన్డేల సిరీస్‌లో 1-0తో ముందంజలో ఉంది. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ (3/50), భువనేశ్వర్‌ కుమార్‌(2/9) అద్భుత ప్రదర్శన చేశారు. ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన రహానేకు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు లభించింది.

మ్యాచ్‌ 43 ఓవర్లకు కుదింపు

మ్యాచ్‌ 43 ఓవర్లకు కుదింపు

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీసేన ఇన్నింగ్స్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. అజింక్యా రహానే (104 బంతుల్లో 103; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ విరాట్ కోహ్లీ (66 బంతుల్లో 87; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులతో రాణించడంతో టీమిండియా 43 ఓవర్లలో 5 వికెట్లకు 310 పరుగులు చేసింది.

శిఖర్ ధావన్ దూకుడు

శిఖర్ ధావన్ దూకుడు

విండీస్ బౌలర్లపై ఆరంభం నుంచే శిఖర్ ధావన్ (59 బంతుల్లో 63; 10 ఫోర్లు) ఎదురుదాడి చేశాడు. రహానేతో కలిసి తొలి వికెట్‌కు 114 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చాడు. ధావన్ అవుటైన తర్వాత వచ్చిన కోహ్లీ కూడా సమయోచితంగా స్పందించడంతో ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. ఈ క్రమంలో రహానే కెరీర్‌లో మూడో సెంచరీ నమోదు చేశాడు.

సిక్సర్లతో చెలరేగిన కోహ్లీ

సిక్సర్లతో చెలరేగిన కోహ్లీ

రెండో వికెట్‌కు 97 పరుగులు జత చేశాకా కమ్మిన్స్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. హార్దిక్ పాండ్యా (4), యువరాజ్ సింగ్ (14) నిరాశపర్చినా, కోహ్లీ భారీ సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఈ ఇద్దరితో కలిసి 62 పరుగులు జత చేశారు. ఆఖర్లో ధోనీ (13 నాటౌట్), కేదార్ (13 నాటౌట్) మెరుగ్గా ఆడటంతో భారత్ భారీ స్కోరు చేసింది. జోసెఫ్ 2, కమిన్స్, హోల్డర్, నర్స్ తలా ఓ వికెట్ తీశారు. అనంతరం 311 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బతగిలింది. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అద్భుత బంతికి కీరన్‌ పావెల్‌(0) వెనుదిరిగాడు.

పీకల్లోతు కష్టాల్లో వెస్టిండిస్

పీకల్లోతు కష్టాల్లో వెస్టిండిస్

అనంతరం క్రీజులోకి వచ్చిన జేసన్‌ మహ్మద్‌ కూడా భువీ వేసిన మూడో ఓవర్‌లో డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. దీంతో విండీస్‌ మొదట్లోనే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో క్రీజులో ఉన్న మరో ఓపెనర్‌ హోప్‌ మాత్రం ధాటిగా ఆడుతూ వచ్చాడు. మరో బ్యాట్స్‌మన్‌ లూయిస్‌ సాయంతో 4/2 స్థితిలో ఉన్న జట్టుకు పటిష్ట స్థితిలో నిలిపేందుకు యత్నించాడు. అయితే 93 పరుగుల వద్ద లూయిస్‌(21) అవుటయ్యాడు.

భారత్‌ బౌలింగ్‌‌ను ఎదుర్కొనడంలో విఫలం

భారత్‌ బౌలింగ్‌‌ను ఎదుర్కొనడంలో విఫలం

బౌండరీలు, సిక్సర్లతో చెలరేగుతూ సెంచరీ చేసేలా కనిపించిన అతడిని కుల్దీప్ పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో విండీస్‌ స్కోరు బోర్డు నెమ్మదించింది. హోప్‌ మినహా మిగతా భారత్‌ బౌలింగ్‌‌ను ఎదుర్కొనడంలో విఫలమయ్యారు. ఆ తర్వాత వచ్చిన హోల్డర్‌(29) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోలేకపోయాడు. కుల్దీప్‌ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమై ధోనీ చేతిలో స్టంపౌటయ్యాడు.

ఆరు వికెట్లు కోల్పోయి 205 పరుగులు

ఆరు వికెట్లు కోల్పోయి 205 పరుగులు

నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే వరకు చివరి వరకు క్రీజులో ఉన్న ఛేజ్‌(33), నర్స్‌(19) భారీ షాట్లకు ప్రయత్నించలేదు. దీంతో వెస్టిండిస్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 205 పరుగులు మాత్రమే చేసింది. కుల్‌దీప్‌ యాదవ్‌ (3/50), భువనేశ్వర్‌ కుమార్‌(2/9) అద్భుత ప్రదర్శన చేశారు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+