For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీదే విజయం: రెండో వన్డేలో ఓడిన దక్షిణాఫ్రికా

ఇండోర్: దక్షిణాఫ్రికాపై ఒంటరి పోరు చేసి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రెండో వన్డేలో విజయం సాధించాడు. ఈ విజయం ధోనీకే దక్కుతుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ వికెట్లు పటపటా రాలిన స్థితిలో ధోనీ క్రీజుపై నిలదొక్కుకుని 92 పరుగులు చేయడం ద్వారా దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాడు. భారత్ 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 43.4 ఓవర్లలో 225 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను భారత్ 1-1 స్కోరుతో సమం చేసింది.

భారత బౌలర్లలో అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్ మూడేసి వికెట్లు తీసి విజయానికి బాటలు వేశారు. హర్భజన్ సింగ్ రెండు వికెట్లు తీయగా మోహిత్ శర్మ, ఉమేష్ యాదవ్ చెరో వికెట్ తీశారు.

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన రెండో వన్డేలో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. హోల్కర్ స్టేడియంలో ఇప్పటి వరకు జరిగిన మూడు వన్డేల్లో భారత్ గెలిచిన నేపథ్యంలో ఈ మ్యాచులో కూడా భారత విజయం తథ్యమని భావించినట్లే జరిగింది. సఫారీలు 200 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయారు. దక్షిణాఫ్రికా 221 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగులో ఇమ్రాన్ తాహిర్ 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.

లైవ్:

2011లో ఇక్కడి జరిగిన వన్డేలో వీరేంద్ర సెహ్వాగ్ డబుల్ సెంచరీ చేసి వెస్టిండీస్‌పై విజయానికి బాటలు వేశాడు. అయితే ఐదు మ్యాచుల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఓటమి పాలైంది. కాన్పూర్ లో జరిగిన ఈ మ్యాచులో రోహిత్ శర్మ 150 పరుగులు చేసిన ప్రయోజనం లేకపోయింది.

మ్యాచ్ స్కోరు వివరాలు..

2nd ODI: India make 3 changes, opt to bat first in Indore

భారత్ నిర్దేశించిన 248 లక్ష్యాన్ని ఛేధించేందుకు బరిలో దిగిన సఫారీలు నిలకడగా ఆడినప్పటికీ విజయాన్ని చేజార్చుకున్నారు. ఓపెనర్లుగా వచ్చిన హషీం ఆమ్లా 17 పరుగులు చేసి ఔటవగా, డికాక్ 34 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన డుమిని 36 పరుగులు చేసి అక్షర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం 51 పరుగులు చేసిన డుప్లిసిస్.. అక్షర్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు.

ఆ తర్వాత వచ్చిన డేవిడ్ మిల్లర్ పరుగులేమి చేయకుండానే భువనేశ్వర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో దక్షిణాఫ్రికా పరాజయం ఖాయమైంది.

అంతకుముందు..

మ్యాచ్ ఆరంభంలోనే భారత్‌కు ఎదురు దెబ్బ తగిలింది. రోహిత్ శర్మ 10 బంతుల్లో 3 పరుగులు చేసి అవుటయ్యాడు. 1.4 ఓవర్ వద్దే తొలి వికెట్ పోయింది. రబడ బౌలింగులో అవుటయ్యాడు. ఆ తర్వాత శిఖర్ ధావన్ రూపంలో రెండో వికెట్ పడింది. 23 పరుగులు చేసిన ధావన్.. మోర్కెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

2nd ODI: India make 3 changes, opt to bat first in Indore

12 పరుగులు చేసిన కోహ్లీ రనౌట్‌గా వెనుదిరిగాడు. 51 పరుగులు చేసిన అనంతరం రహానే.. ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రైనా పరుగులేమి చేయకుండానే మోర్కెల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అక్షర్ పటేల్ కూడా 13 పరుగులు చేసి స్టెయిన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

14 పరుగులు చేసిన భువనేశ్వర్ కుమార్.. ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన హర్భజన్ సింగ్ కాసేపు దూకుడుగా ఆడాడు. 22 బంతుల్లో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. 4 పరుగులు చేసిన యాదవ్ కూడా వెనుదిరగడంతో మోహిత్ శర్మ క్రీజులోకి వచ్చాడు. 9 వికెట్ల నష్టానికి భారత్ 247 పరుగులు చేసింది. టీమిండియా కెప్టెన్ ధోనీ 86 బంతుల్లో 92 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+