అభిమానిని ధోని పరిగెత్తించడంపై కామెంట్రీ బాక్సులో గవాస్కర్ సరదా వ్యాఖ్యలు

హైదరాబాద్: నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీతో కరచాలనం కోసం ఓ అభిమాని వెంటపడిన సంగతి తెలిసిందే. భారత్ బ్యాటింగ్ ముగిసిన తర్వాత ఫీల్డింగ్ చేయడానికి జట్టు సభ్యులు మైదానంలోకి వెళుతున్న సమయంలో ధోనికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు అభిమాని యత్నించాడు. అయితే అభిమాని నుంచి తప్పించుకునేందుకు ధోని మైదానంలో పరుగులు తీశాడు.
ఆ అభిమాని సైతం ధోనిని వదలకుండా పరుగు తీశాడు. చివరకు ఎంతకూ ఆ అభిమాని వదలకపోవడం ధోని వికెట్ల వద్ద నిలబడిపోయాడు. దీంతో ధోనిని అభిమాని గట్టిగా ఆలింగనం చేసుకుని ఆనందంతో మురిసిపోయాడు. ఈ ఘటనపై మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మండిపడగా.. సునీల్ గవాస్కర్ మాత్రం సరదాగా స్పందించాడు.

కామెంట్రీ బాక్స్‌లో ఉన్న సునీల్ గవాస్కర్
ఈ సంఘటన జరిగిన సమయంలో సునీల్ గవాస్కర్, మాథ్యూ హెడెన్ కామెంట్రీ బాక్స్‌లో ఉన్నారు. దీంతో పక్కనే ఉన్న సునీల్ గవాస్కర్‌తో మాథ్యూ హెడెన్ ‘భద్రతా సిబ్బంది ఎక్కడ సన్నీ?' అని సరదాగా ప్రశ్నించాడు. దీనికి గవాస్కర్ బదులిస్తూ "భద్రతా సిబ్బంది కూడా మ్యాచ్‌ను చూస్తున్నారు. భారత్‌లో అభిమానుల్ని వారు నియంత్రించడం కష్టం" అని చెప్పాడు.
ప్యాన్స్‌కు ఎదురుగా కుర్చీలు వేసుకుని కూర్చుంటారు
"ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలో అయితే.. సెక్యూరిటీ సిబ్బంది అభిమానుల్ని గమనిస్తూ వారికి ఎదురుగా కుర్చీలు వేసుకుని కూర్చుంటారు. దీంతో ఫ్యాన్స్ ఏమైనా వేషాలు వేస్తే, వెంటనే చర్యలు తీసుకుంటారు. కానీ, భారత్‌లో అందుకు భిన్నం. అభిమానులతో పాటు సెక్యూరిటీ సిబ్బంది కూడా మ్యాచ్‌ను వీక్షిస్తుంటారు. భారత్‌లో ప్రతి ఒక్కరూ క్రికెట్‌ని ఆస్వాదిస్తారు. కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే నువ్వు మ్యాచ్‌ను చూస్తావా? ఫ్యాన్స్‌ను చూస్తావా?" అని గవాస్కర్ అన్నాడు.

నాగ్‌పూర్ వన్డేలో ధోని గోల్డెన్ డకౌట్
నాగ్‌పూర్ వన్డేలో ధోని గోల్డెన్ డకౌట్ అయిన సంగతి తెలిసిందే. తన వన్డే కెరీర్‌లో ధోని ఇలా గోల్డెన్ డక్‌గా ఔట్ కావడం ఐదోసారి. అంతేకాదు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ అదే జట్టుపై ధోని గోల్డెన్ డకౌటయ్యాడు. తన 2004లో బంగ్లాదేశ్‌తో చిట్టగాంగ్ వేదికగా జరిగిన వన్డేలో ధోనీ తొలి బంతికే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత 2005లో శ్రీలంకతో అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో, 2007లో మరోసారి శ్రీలంకతో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో, చివరిగా 2010లో వైజాగ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధోని తొలి బంతికే గోల్డెన్ డక్‌గా నిష్క్రమించాడు.

వన్డేల్లో కోహ్లీ 40వ సెంచరీ
రెండో వన్డేలో టీమిండియా విరాట్ కోహ్లి (116; 120 బంతుల్లో 10 ఫోర్లు) సెంచరీకి తోడు విజయ్ శంకర్(46; 41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకోవడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన 48.2 ఓవర్లలోనే 250 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో జడేజా 21 పరుగులు చేశాడు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 242 పరుగులకే కుప్పకూలింది. రెండో వన్డేలో విజయం సాధించడంతో ఐదు వన్డేల సిరిస్‌లో టీమిండియా 2-0 ఆధిక్యంలో నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications