ఏప్రిల్ 2, 2011: 28ఏళ్ల నిరీక్షణకు తెర, ధోని సిక్స్‌తో భారత్‌కు వరల్డ్‌కప్ (వీడియో)

హైదరాబాద్: ఏప్రిల్ 2, 2011... భారత క్రికెట్ చరిత్రలో ఓ ప్రత్యకమైన రోజు. ఆరోజుకు ఉన్న ప్రత్యేకం ఏంటని ఆలోచిస్తున్నారా? సరిగ్గా ఏడు సంవత్సరాల క్రితం 2011లో ఏప్రిల్ 2న ముంబైలోని వాంఖడే మైదానంలో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని టీమిండియా రెండోసారి వన్డే వరల్డ్ కప్ టోర్నీని కైవసం చేసుకుంది.
దీంతో 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. 1983లో కపిల్‌దేవ్ నాయకత్వంలో టీమిండియా తొలిసారి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో వెస్టిండిస్‌పై విజయం సాధించి వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత గంగూలీ నాయకత్వంలో టీమిండియా మరోసారి వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరినప్పటికీ, ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలై రన్నరప్‌గా నిలిచింది.

వాంఖడెలో 2011 వరల్డ్ కప్ ఫైనల్
2011 వరల్డ్ కప్‌కు ఉపఖండం ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. ముంబైలోని వాంఖడె మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. లంక బ్యాట్స్‌మెన్లలో మహిళా జయవర్దనే 103 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం 275 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా జట్టు స్కోరు ఒక పరుగు వద్ద ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ లసిత్ మలింగ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు.

సచిన్ ఔట్‌తో భారత అభిమానుల్లో ఆందోళన
ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ (18) పరుగుల వ్కక్తిగత స్కోరు వద్ద మలింగ బౌలింగ్‌లో వికెట్ కీపర్ కుమార సంగక్కరకు క్యాచ్ ఇచ్చి ఓటయ్యాడు. దీంతో భారత అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీతో కలిసి గౌతమ్ గంభీర్ భారత ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ ఇద్దరూ కలిసి నెమ్మదిగా ఆడుతూ స్కోరు బోర్డు వేగం పెంచారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ (35) పరుగుల వద్ద దిల్షాన్ బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్డ్‌గా పెవిలియన్‌కు చేరాడు.

యువీతో కలిసి స్కోరు బోర్డుని పరిగెత్తించిన ధోని
కోహ్లీ ఔటైన తర్వాత యువరాజ్ సింగ్ క్రీజులోకి వస్తాడని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా ధోని బరిలోకి దిగాడు. గంభీర్‌తో కలిసి ధోనీ దూకుడు మొదలుపెట్టాడు. ఈ ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ దూకుడుగ ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
సిక్స్ బాది భారత్‌కు భారత్‌కు అద్భుతమైన విజయం
ఈ క్రమంలో గంభీర్ (97) పరుగుల వద్ద పెరీరా బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీ నమోదు చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన యువరాజ్ సింగ్‌తో కలిసి ధోని అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో భారత్ గెలుపు ఖరారైంది. స్టేడియంలో అభిమానుల కేరింతలు, సందడి మధ్య 49వ ఓవర్ మొదలైంది. తొలి బంతిని ఎదుర్కొన్న యువరాజ్ సింగ్ సింగిల్ తీసి ధోనీకి స్ట్రైకింగ్ ఇచ్చాడు. రెండో బంతిని తనదైన శైలిలో సిక్స్‌గా మలిచిన ధోనీ భారత్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఆ సిక్సర్ మాత్రం భారతీయుల గుండెల్లో ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది. మహీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. దీంతో రెండోసారి వరల్డ్ కప్ గెలవాలన్న భారత అభిమానుల 28 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications