25 wins, 1 loss: ఆసీస్ రికార్డు బద్దలు, సరికొత్త చరిత్ర సృష్టించిన టీమిండియా

హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను ఇంకో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరిస్‌ను కైవసం చేసుకోవడం ద్వారా టీమిండియా టెస్టు క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియా జట్టు పేరిట ఉన్న రికార్డుని బద్దలు కొట్టింది.
స్వదేశంలో అత్యధిక టెస్టు సిరిస్ విజయాలను నమోద చేసిన జట్టుగా టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాపై టీమిండియా నెగ్గిన టెస్టు సిరీస్ స్వదేశంలో వరుసగా 11వది కావడం విశేషం. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా రికార్డును కోహ్లీసేన అధిగమించింది.
సొంతగడ్డపై వరుసగా 10 టెస్టు సిరిస్ విజయాలు
1994-95 సీజన్ మొదలు కొని 2000-01 సీజన్ వరకూ ఆస్ట్రేలియా సొంతగడ్డపై వరుసగా 10 టెస్టు సిరిస్ విజయాలను నమోదు చేసింది. ఆ తర్వాత 2004-09 సీజన్ మధ్యలో ఆస్ట్రేలియా మరోసారి 10 వరుస స‍్వదేశీ టెస్టు సిరీస్ విజయాలు సాధించింది. అయితే, ఇప్పుడు ఆ రికార్డుని టీమిండియా బద్దలు కొట్టింది.
భారత్ వరుసగా 11 టెస్టు సిరిస్ విజయాలు
2012-13 సీజన్ నుంచి ఇప్పటివరకూ భారత్ వరుసగా 11 టెస్టు సిరీస్ విజయాల్ని నమోదు చేసింది. ఈ జాబితాలో టీమిండియా, ఆస్ట్రేలియాల తర్వాత స్థానంలో వెస్టిండిస్ ఉంది. 1975-76 సీజన్ నుంచి 1985-86 సీజన్ వరకూ వెస్టిండిస్ తమ సొంత గడ్డపై వరుసగా ఎనిమిది టెస్టు సిరీస్ విజయాలు నమోదు చేసింది.
2012-13 నుంచి ఇప్పటివరకూ టీమిండియా స్వదేశంలో సాధించిన టెస్టు సిరీస్ విజయాలు:
ఇండియా vs దక్షిణాఫ్రికా 2019: 2-0 * (3)
ఇండియా vs వెస్టిండీస్ 2018: 2-0 (2)
ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్ 2018: 1-0 (1)
ఇండియా vs శ్రీలంక 2017: 1-0 (3)
ఇండియా vs ఆస్ట్రేలియా 2017: 2-1 (4)
ఇండియా vs బంగ్లాదేశ్ 2017: 1-0 (1)
ఇండియా vs ఇంగ్లాండ్ 2016: 4-0 (5)
ఇండియా vs న్యూజిలాండ్ 2016: 3-0 (3)
ఇండియా vs దక్షిణాఫ్రికా 2015: 3-0 (4)
ఇండియా vs వెస్టిండీస్ 2013: 2-0 (2)
ఇండియా vs ఆస్ట్రేలియా 2013: 4-0 (4)
కోహ్లీ ఖాతాలో ఓ అరుదైన రికార్డు
తాజా విజయంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. తొలి 50 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన మూడో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఇది 30వ విజయం కాగా... కెప్టెన్‌గా 50వ టెస్టు మ్యాచ్. దీంతో తొలి 50 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజాలు స్టీవ్ వా(37), రికీ పాంటింగ్(35)ల తర్వాత మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో కోహ్లీ తర్వాత వివ్ రిచర్డ్స్(27) నాలుగో స్థానంలో ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications