ఏప్రిల్ 23: కోహ్లీసేనకు గుర్తుండి పోయే రోజు, ఎందుకంటే!
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఈ జట్టుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ జట్టులో ప్రపంచంలోని అత్యుత్తమ విధ్యంసకర బ్యాట్స్‌మెన్ ఉన్నారు. వెస్టిండిస్ ఓపెనర్ క్రిస్ గేల్, దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇలా వీరు క్రీజులో ఉన్నారంటే పరుగుల వరద సునామీ సృష్టిస్తారు.
బలంగా కొట్టారంటే బంతి స్టేడియం పైకప్పు బయట పడాల్సిందే. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల సాధించిన జట్లలో బెంగళూరు మొదటి స్ధానంలో ఉంది. 263/5 ఐపీఎల్‌లో ఓ జట్టు చేసిన అత్యధిక స్కోరు. అలాంటి జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 49 పరుగులకే ఆలౌటైంది.

ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోరు
దీంతో పదేళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. అయితే బెంగళూరు అత్యల్ప, అత్యధిక స్కోర్లు నమోదు చేసింది ఒకే రోజు కావడం యాదృచ్ఛికం. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 19.3 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది.

9.4 ఓవర్లలో 49 పరుగులకు ఆలౌట్
అనంతరం 132 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 9.4 ఓవర్లలో 49 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోవడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా 82 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.

2013 ఐపీఎల్‌లో పూణె వారియర్స్‌పై 263
ఐపీఎల్ 2013లో ఏప్రిల్ 23న బెంగళూరు అత్యధిక పరుగులు సాధించింది. పూణె వారియర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 5 వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ క్రిస్ గేల్ (66 బంతుల్లో 175; 13 ఫోర్లు, 17 సిక్సులు) నాటౌట్‌గా నిలిచాడు. ఏబీ డివిలియర్స్ (31), దిల్షాన్ (33) పరుగులతో రాణించారు. బౌలింగ్ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్ (5.75 ఎకానమీ)తో పరుగులివ్వగా, దిండా నాలుగు ఓవర్లకు 48, మిచెల్ మార్ష్ 3 ఓవర్లకు 56, ముర్తజా 2 ఓవర్లకు 45, ఫించ్ 6 బంతుల్లో 29 పరుగులిచ్చారు.
2017 ఐపీఎల్‌లో కోల్‌కతాపై 263
ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఐపీఎల్ 2017లో ఏప్రిల్ 23 జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఆటగాళ్లు ఏ మాత్రం సత్తా చాటలేక పోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 19.3 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 132 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 9.4 ఓవర్లలో 49 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 'గోల్డెన్ డకౌట్' అయ్యాడు. గేల్ (7), ఏబీ డివిలియర్స్ (8), కేదార్ జాదవ్ (9), మన్‌దీప్ సింగ్ (1) పరుగులు చేశారు. ఇక కోల్‌కతా బౌలర్లలో కౌల్టర్‌నైల్ (3/21), క్రిస్‌వోక్స్ (3/6), గ్రాండ్‌హోమ్ (3/4), ఉమేశ్ యాదవ్ (1/15) వికెట్లు తీశారు. అలా ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప, అత్యధిక స్కోర్లు చేసిన జట్టుగా నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications