22 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదేరోజున: భారత ఆటగాళ్లపై పాక్ ఫ్యాన్స్ రాళ్ల దాడి!

హైదరాబాద్: 22 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున 1997లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య పాకిస్థాన్‌తో కరాచీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇరుదేశాల మధ్య రాజకీయ సంక్షోభం కారణంగా 1989-90 తర్వాత 1997లో తొలిసారి పాక్‌లో టీమిండియా పర్యటించింది. అంతకముందు వరకు తటస్థ వేదికల్లో మ్యాచ్‌లు జరిగేవి.
అయితే, పాకిస్థాన్‌కు స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా మూడు వన్డేల సిరిస్ కోసం టీమిండియా ఆ దేశంలో పర్యటించింది. విల్లిస్ ఛాలెంజ్ సిరిస్ పేరిట జరిగిన ఈ సిరిస్‌లో కరాచీ ఆతిథ్యమిచ్చిన రెండో వన్డే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. మైదానంలోని ప్రేక్షకులు సృష్టించిన అలజడి కారణంగా నాలుగు సార్లు అంఫైర్లు మ్యాచ్‌ని నిలిపివేశారు.

భారత ఫీల్డర్లపైకి పాక్ ఫ్యాన్స్ దాడి
ముఖ్యంగా మైదానంలో ఫీల్డింగ్ చేస్తోన్న భారత ఫీల్డర్లపైకి పాకిస్థాన్ అభిమానులు పలుమార్లు రాళ్లు రువ్వడంతో మ్యాచ్‌ని పలుమార్లు నిలిపివేశారు. నాలుగోసారి పాక్ అభిమానులు మరింత పైత్యం ప్రదర్శించడంతో భారత ఫీల్డర్లు తామింక ఫీల్డింగ్ చేయలేమని తేల్చి చెప్పారు. దీంతో మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగలే 48వ ఓవర్ తర్వాత పాకిస్థాన్ ఇన్నింగ్స్ ముగిసినట్లు ప్రకటించారు.

పాక్ ఇన్నింగ్స్ ముగిసే సమయానికి
పాక్ ఇన్నింగ్స్ ముగిసే సమయానికి ఇంజమామ్ ఉల్ హాక్(74) హాఫ్ సెంచరీతో చెలరేగగా... మొయిన్ ఖాన్ (31) పరుగులతో ఉన్నారు. అంతకముందు షాహిద్ అఫ్రిది 56 బంతుల్లో 72 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించి పాక్ భారీ స్కోరు చేయడంతో కీలకపాత్ర పోషించాడు. భారత ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని మ్యాచ్ రిఫరీ పైనిర్ణయం తీసుకున్నారు.

47 ఓవర్లకు గాను 266 పరుగులుగా
అనంతరం టీమిండియా విజయ లక్ష్యాన్ని 47 ఓవర్లకు గాను 266 పరుగులుగా నిర్దేశించారు. విపత్కర పరిస్థితుల్లో ఓడిపోతే దానికి మించి అవమానం మరొకటి ఉండదు. అప్పటికే మైదానంలో పాక్ అభిమానుల చేత రాళ్ల దాడికి గురి కావడంతో సౌరవ్ గంగూలీ తన అసాధరణ ఆటతో గొప్ప విజయాన్ని అందించి యావత్ భారత్ అభిమానులు తలెత్తుకునేలా చేశాడు. సచిన్ టెండూల్కర్(21) స్వల్ప స్కోర్‌కే వెనుదిరగడంతో భారత్ కష్టాల్లో పడింది. ఈ సమయంలో కాంబ్లితో కలిసి గంగూలీ నిర్ణయాత్మకమైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.

2-1తో సిరిస్ కైవసం
ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(89) పరుగులతో చెలరేగగా... వినోద్ కాంబ్లీ హాఫ్ సెంచరీతో మెరవడంతో 3 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధంచి భారత్ విజయం సాధించింది. అయితే, ఈ సిరిస్‌ను పాకిస్థాన్ 2-1తో కైవసం చేసుకోవడం విశేషం. అంతకముందు సహారా కప్‌లో భారత్ చేతిలో 4-1తో ఓడిన పరాభవానికి ప్రతీకారం కూడా తీర్చుకుంది. 26/11 ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ జట్టుతో టీమిండియా ద్వైపాక్షిక సిరిస్‌లను ఆడటం పూర్తిగా నిలిపివేసింది. ఈ మధ్య కాలంలో ఇరు జట్ల కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి.

చివరగా 2012లో భారత్‌లో
చివరగా పాకిస్థాన్ జట్టు 2012లో భారత్‌లో పర్యటించింది. 2015లో అడిలైడ్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. అంతకముందు జరిగిన ఆసియా కప్, టీ20 వరల్డ్‌కప్‌లో సైతం పాకిస్థాన్‌పై టీమిండియాదే పైచేయి. ఈ రెండు సందర్భాల్లో టీమిండియానే విజయం సాధించింది.

వరల్డ్‌కప్‌లో పాక్‌పై భారత్ విజయం
ఇక, 2017లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధించిన టీమిండియా... ఓవల్ వేదికగా జరిగిన పైనల్లో మాత్రం ఓడిపోయింది. ఆ తర్వాత 2018లో జరిగిన ఆసియా కప్‌లో, 2019 వన్డే వరల్డ్‌కప్‌లో కూడా టీమిండియా విజయం సాధించింది. ఇటీవలే ముగిసిన వరల్డ్‌కప్‌లో పాక్‌పై అలవోక విజయాన్ని నమోదు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications