Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నవంబర్ 20 ప్రత్యేకత ఇదీ: నాడు సచిన్, నేడు విరాట్ కోహ్లీ

20th November 2009: Sachin Tendulkar Crosses 30,000 Run Barrier

హైదరాబాద్: భారత క్రికెట్‌లో నవంబర్ 20కి ఓ ప్రత్యేకత ఉంది. ఎనిమిదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు అంటే నవంబర్‌ 20న క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన రికార్డుని నెలకొల్పాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 30 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

 కోహ్లీ 50 సెంచరీల రికార్డు

కోహ్లీ 50 సెంచరీల రికార్డు

మళ్లీ ఇన్నాళ్లకు ఇదే రోజున టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ 50 సెంచరీల రికార్డుని నమోదు చేశాడు. ఇక్కడ విశేషం ఏంటంటే అప్పుడు.. ఇప్పుడు ప్రత్యర్ధి శ్రీలంక జట్టే కావడం. అంతేకాదు ఈ రెండు రికార్డులు టెస్టు మ్యాచ్‌లో చివరిరోజు ఆటలో నమోదు కావడం మరో విశేషం. అహ్మదాబాద్‌ వేదికగా 2009లో లంకతో జరిగిన టెస్టు చివరి రోజు ఆటలో భాగంగా ఇన్నింగ్స్ 44వ ఓవర వేసిన చనక వెలిగెదర బౌలింగ్‌లో డీప్ స్క్వేర్ లెగ్‌లో సింగిల్ తీసి సచిన్ ఈ మైలురాయిని అందుకున్నాడు.

 100 సెంచరీలు నమోదు చేసిన సచిన్

100 సెంచరీలు నమోదు చేసిన సచిన్

ఈ సమయంలో సచిన్ వ్యక్తిగత స్కోరు 35 పరుగులు. టెస్టుల్లో 12,777, వన్డేల్లో 17,178, టీ20ల్లో 10 పరుగులను కలుపుకొని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఈ అరుదైన ఘనత సాధించాడు. ఇలా తాను క్రికెట్‌కు వీడ్కోలు పలికే నాటికి మూడు ఫార్మాట్లలో కలిపి సచిన్ 100 సెంచరీలు నమోదు చేశాడు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మట్లలో 34357 పరుగులు చేసి అత్యధిక పరుగుల నమోదు చేసిన క్రికెటర్ల జాబితాలో తొలిస్థానంలో ఉన్నాడు. ఆ తరువాతి స్థానంలో శ్రీలంక మాజీ క్రికెటర్‌ కుమార సంగక్కర (28016) ఉన్నాడు.

 విరాట్ కోహ్లీకి ఇది 50వ అంతర్జాతీయ సెంచరీ

విరాట్ కోహ్లీకి ఇది 50వ అంతర్జాతీయ సెంచరీ

కాగా, ఈడెన్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో విరాట్ కోహ్లీ సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీకి ఇది 50వ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. 119 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. అంతేకాదు ఈ సెంచరీకి ఎంతో ప్రత్యేకతం ఉంది. విరాట్ కోహ్లీ టెస్టు కెరీర్‌లో ఈడెన్‌లో చేసిన తొలి సెంచరీ ఇది. ఇన్నింగ్స్ 88.4వ బంతిని సిక్స్‌గా మలిచి కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు. ఇప్పటి వరకూ తన టెస్టు కెరీర్‌లో 18 సెంచరీలను నమోదు చేసిన కోహ్లీ ఈడెన్ గార్డెన్స్‌లో ఒక్కటీ నమోదు చేయలేదు. ఇందులో 4 డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి.

 అరుదైన క్లబ్‌లో విరాట్ కోహ్లీ

అరుదైన క్లబ్‌లో విరాట్ కోహ్లీ

అయితే తొలిసారి ఈడెన్ గార్డెన్స్‌లో సత్తాచాటాడు. రెండో ఇన్నింగ్స్‌లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. సోమవారం చివరి రోజు ఆటలో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ లంచ్ విరామం తర్వాత సెంచరీని నమోదు చేశాడు. ఈ సెంచరీతో విరాట్ కోహ్లీ అరుదైన క్లబ్‌లో చేరాడు. వన్డేల్లో 32 సెంచరీలు చేసిన కోహ్లీకి.. టెస్టుల్లో ఇది 18వ సెంచరీ. సచిన్ టెండూల్కర్ (100 సెంచరీలు) తర్వాత క్రికెట్‌లో 50 అంతకన్నా ఎక్కువ సెంచరీలు చేసిన రెండో క్రికెటర్ భారత క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.

ఎనిమిదో స్థానంలో కోహ్లీ

ఎనిమిదో స్థానంలో కోహ్లీ

పాంటింగ్ (71), సంగక్కర (63), కలిస్ (62), ఆమ్లా (54), జయవర్దనె (54), లారా (53) అంతర్జాతీయ క్రికెట్‌లో 50కిపైగా సెంచరీలు చేశారు. దీంతో టెస్టుల్లో 18 సెంచరీలు, వన్డేల్లో 32 సెంచరీలతో కోహ్లి ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో 50 సెంచరీలను సాధించిన ఆటగాళ్లలో కోహ్లీ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.

Story first published: Monday, November 20, 2017, 18:11 [IST]
Other articles published on Nov 20, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+