Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మహిళల టీ20 ప్రపంచకప్‌లో సరికొత్త రికార్డు!!

2020 Women’s T20 World Cup Overhauls Viewership Record In Women’s Cricket

సిడ్నీ: మహిళల క్రికెట్‌కి రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. ఇందుకు ఉదాహరణే ఇటీవల జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్. మెల్‌బోర్న్‌ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు ఏకంగా 86,174 మంది ప్రేక్షకులు స్టేడియానికి వచ్చారు. మహిళా క్రికెట్ చరిత్రలో ఇంత మంది ఓ మ్యాచ్‌కి హాజరవడం అదే తొలిసారి. అయితే వ్యూవర్‌షిప్‌లోనూ మహిళల టీ20 ప్రపంచకప్‌ సరికొత్త రికార్డులు నెలకొల్పిందని బ్రాడ్‌కాస్టర్‌ 'స్టార్‌ స్పోర్ట్స్' ఓ ప్రకటనలో పేర్కొంది.

వ్యూవర్‌షిప్‌లోనూ రికార్డే:

వ్యూవర్‌షిప్‌లోనూ రికార్డే:

మహిళల టీ20 ప్రపంచకప్‌ని ఏకంగా 5.4 బిలియన్ నిమిషాలు వీక్షించినట్లు స్టార్‌స్పోర్ట్స్ వెల్లడించింది. 2018లో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌ని 1.8 బిలియన్ నిమిషాలు వీక్షించారు. అంటే ఈసారి దాదాపు మూడు రెట్లు ఎక్కువ. 2018 టీ20 ప్రపంచకప్‌ని 36.9 మిలియన్‌ మంది వీక్షించగా.. ఈ ఏడాది ఏకంగా 74.9 మిలియన్లకి చేరింది. ఇక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లలో 1.3 మిలియన్ మంది ఈ ఏడాది ప్రపంచకప్‌ గురించి శోదించారట. 2018తో పోలిస్తే ఇది 5.2 రెట్లు ఎక్కువ. దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు మహిళల క్రికెట్‌కి రోజురోజుకు క్రేజ్ పెరుగుతోందని.

 ఎంసీజీకి 86,174 మంది ప్రేక్షకులు:

ఎంసీజీకి 86,174 మంది ప్రేక్షకులు:

మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు ఈసారి భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ప్రపంచకప్‌ ఫైనల్ సందర్భంగా ఏకంగా 86,174 మంది ప్రేక్షకులు ఎంసీజీకి తరలివచ్చారు. దీంతో అత్యధిక వీక్షకులు వచ్చిన మహిళల క్రికెట్‌ మ్యాచ్‌గా భారత్‌-ఆస్ట్రేలియా ఫైనల్‌ మ్యాచ్‌ రికార్డుల్లోకి ఎక్కింది. ఇక ఆసీస్‌లో జరిగిన ఓ మహిళల ఈవెంట్స్‌కు అత్యధిక వీక్షకులు హాజరైన పోటీ కూడా ఇదే.

85 పరుగుల తేడాతో ఓటమి:

85 పరుగుల తేడాతో ఓటమి:

ఫైనల్లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 184 పరుగులు చేసింది. ఓపెనర్లు ఎలీసా హేలీ (39 బంతుల్లో 75; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), బెత్‌ మూనీ (54 బంతుల్లో 78 నాటౌట్‌; 10 ఫోర్లు) చితకొట్టారు. భారత బౌలర్లలో పూనమ్‌ యాదవ్‌ (1/30) పెద్దగా ప్రభావం చూపలేకపోగా.. మరో స్పిన్నర్‌ దీప్తి శర్మ (2/38) ఫర్వాలేదనిపించింది. అనంతరం లక్ష్య ఛేనలో భారత్‌ 19.1 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటైంది. దీప్తి శర్మ (33; 2 ఫోర్లు) టాప్‌ స్కారర్‌. ఆసీస్‌ బౌలర్లలో షుట్‌ (4/18), జెస్‌ జొనాసెన్‌ (3/20) రాణించారు. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో 85 పరుగుల తేడాతో ఓడి కప్‌ని చేజార్చుకుంది.

ప్రపంచకప్‌లో హర్మన్‌సేన చెత్త రికార్డు:

ప్రపంచకప్‌లో హర్మన్‌సేన చెత్త రికార్డు:

మహిళా టీ20 ప్రపంచకప్‌లో హర్మన్‌సేన ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. మెగాటోర్నీలో అత్యధిక క్యాచులు జారవిడిచిన జట్టుగా బంగ్లాదేశ్‌తో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. టోర్నీ మొత్తంలో భారత మహిళలు 9 క్యాచ్‌లు నేలపాలు చేసారు. మరోవైపు బంగ్లాదేశ్‌ కూడా అన్నే క్యాచ్‌లు జారవిడిచింది. 'క్యాచులే మ్యాచులు గెలిపిస్తాయి' అన్న క్రికెట్‌ సూత్రాన్ని ఈ రెండు జట్లు మరిచిపోయినట్టున్నాయి.

Story first published: Tuesday, March 24, 2020, 12:22 [IST]
Other articles published on Mar 24, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+