
2019 నాకు వరస్ట్ ఇయర్
'హర్షా భోగ్లేపై చేసిన కామెంట్ చాలా పెద్ద తప్పిదం. నేను తప్పు చేసాను. అందుకు చింతిస్తున్నా. దీనికి హర్షా భోగ్లేను క్షమాపణలు కోరుతున్నా. ఆ సమయంలో ఎమోషన్స్ అదుపుఓ ఉంచుకోలేకపోయాను. ఒక ప్రొఫెషనల్ కామెంటేటర్‌గా అలా మాట్లాడటం సరైంది కాదు. కామెంటేటర్‌గా, విశ్లేషకుడిగా 2019 ఎన్నో చేదు జ్ఞాపకాల్ని మిగిల్చింది. ఏడాది నాకు ఒక వరస్ట్ ఇయర్' అని మంజ్రేకర్ అన్నాడు.

విమర్శల వర్షం
2019లో మంజ్రేకర్ చాలాసార్లు నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. మంజ్రేకర్ దేనిపై వ్యాఖ్యానించినా క్రికెట్ అభిమానులు విమర్శల వర్షం కురిపించారు. అయితే ముఖ్యంగా రవీంద్ర జడేజా, హర్షా భోగ్లేలపై చేసిన కామెంట్‌లు అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఈ రెండు సందర్భాల్లో అభిమానులు మంజ్రేకర్‌ను ఆడేసుకున్నారు.

జడేజా లాంటి ఆటగాళ్లకు ఫ్యాన్ కాను
ప్రపంచకప్ సమయంలో జడేజా లాంటి బిట్స్ అండ్ పీసెస్ ఆటగాళ్లకు ఫ్యాన్ కాను. జడేజా కేవలం టెస్టు క్రికెటర్ మాత్రమే.. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు అతడు అన్‌ఫిట్ అని మంజ్రేకర్ అన్నాడు. అంతేకాకుండా జడేజాను అల్‌రౌండర్‌గా పరిగణించబోనని పేర్కొన్నాడు. ఇక జడేజా ట్విట్టర్ వేదికగా మంజేర్ వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు. 'ఇప్పటికే నువ్వు ఆడిన మ్యాచ్‌ల కంటే రెండు రెట్లు ఎక్కువ మ్యాచ్‌లే ఆడాను. ఇంకా ఆడుతూనే ఉన్నాను. ముందుగా నువ్వు ఎవరిని ఎలా గౌరవించాలో నేర్చుకో. ఏదైనా సాధించిన వారిని గుర్తించి గౌరవించు' అని అన్నాడు.

భోగ్లేపై విమర్శలు
నవంబర్ నెలలో కోల్‌కతాలోని భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన డే/నైట్ టెస్టుకు కామెంటేటర్‌గా వ్యవహరించిన మంజ్రేకర్.. హర్షా భోగ్లేను విమర్శించాడు. పింక్ బాల్ టెస్టుకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో అని ఇరు జట్ల ఆటగాళ్లను అడిగి తెలుసుకోవాలని భోగ్లే అనగా.. ఈ విషయం నువ్వే అడగాలి. మేం సాధారణ క్రికెట్ మాత్రమే ఆడం. మాకు అర్హత లేదు అని మంజ్రేకర్ అన్నాడు. హర్షా భోగ్లే క్రికెట్ ఆడకుండానే ప్రముఖ వ్యాఖ్యాతగా ఎదిగిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించాడు.


Click it and Unblock the Notifications












