Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇది వరల్డ్ కప్‌కు ప్రిపరేషన్, వన్డే సిరీస్‌ను గెలిచి తీరతాం: రో'హిట్' శర్మ

2019 World Cup preparations begin in South Africa, want to win ODI series: Rohit Sharma

హైదరాబాద్: 2019 ప్రపంచకప్ కు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలైంది. అదీ దక్షిణాఫ్రికాలో జరిగే వన్డే సిరీస్‌లోని మ్యాచ్‌లనే వరల్డ్ కప్‌కు ప్రిపరేషన్ మ్యాచ్‌లు అనుకుంటామని రోహిత్ శర్మ అన్నాడు. ఇటీవలే జరిగిన టెస్టు సిరీస్‌లో 2-1 తేడాతో ఓడిపోయిన కోహ్లీ సేన ఆరు వన్డేల సిరీస్‌లో ఖచ్చితంగా రాణిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు.

వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇంకా మాట్లాడుతూ ఈ మ్యాచ్‌లను ఇంగ్లాండ్‌ పర్యటనకు బాగా ఉపయోగపడతాయని పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరూ కప్ గెలుచుకునే కాంక్షతోనే ఆడతామని తెలియజేశాడు. కాగా, దక్షిణాఫ్రికాతో తలపడి ఇప్పటివరకు భారత్ ఎప్పుడూ ద్వైపాక్షిక సిరీస్‌లో గెలిచిన దాఖలాలు లేవు. ఈ చరిత్రను తిరగరాస్తామంటున్నాడు రో'హిట్' శర్మ.

జనవరి నెలారంభంలో జరిగిన టెస్టు సిరీస్ ఓడిపోయామని గుర్తు చేశాడు. ఇప్పుడు ఈ వన్డేల సిరీస్ గెలుచుకుని మళ్లీ విజయాల పరంపరను కొనసాగిస్తామన్నాడు. 30 సంవత్సరాల రోహిత్ శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసి వన్డే చరిత్రలో స్థానం సంపాదించుకున్నాడు.

'మేము ఈ సిరీస్‌ను గెలుస్తామనే బలమైన నమ్మకంతో ఉన్నాం. మేము ఈ మ్యాచ్‌ను గెలవాలంటే చాలా పనులు చేయాల్సి ఉంటుందని తెలుసు. దానికి మేం సిద్ధంగానే ఉన్నాం. తీవ్రమైన ఒత్తిడిలోనూ ఆడగలమని ఒకసారి నిరూపించాం. అలాగే మేము ప్రత్యర్థిపై అలాంటి ఒత్తిడినే చూపెట్టి ఖచ్చితంగా గెలిచితీరుతాం' అనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 31, 2018, 11:44 [IST]
Other articles published on Jan 31, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+