Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అమ్మకాలు షురూ: అందుబాటులోకి మళ్లీ వరల్డ్‌కప్ టికెట్లు

ICC Cricket World Cup 2019 : ICC World Cup 2019 Tickets Back On Sale ! | Oneindia Telugu
2019 ICC World Cup tickets back on sale

హైదరాబాద్: మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో తొలి విడుతలో వరల్డ్‌కప్ టిక్కెట్లను దక్కించుకోలేకపోయిన క్రికెట్ అభిమానులకు శుభవార్త. వన్డే వరల్డ్‌కప్ టికెట్ల అమ్మకాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. అన్ని జట్లు, మైదానాల్లో జరిగే మ్యాచ్‌ల కోసం టికెట్లను గురువారం నుంచి విక్రయిస్తున్నట్టు ఐసీసీ వెల్లడించింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఐసీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ అమ్మకాలు జరుపుతున్నారు. ఎవరు ముందుగా వస్తే వాళ్లకే తొలి అవకాశంగా టిక్కెట్లను అందజేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా టిక్కెట్లకు మంచి ఆదరణ లభిస్తున్నది. అందుబాటులో ఉన్న 8 లక్షల టిక్కెట్ల కోసం 6 ఖండాలలోని 148 దేశాల నుంచి 30 లక్షల దరఖాస్తులు వచ్చాయి.

మడగాస్కర్, మెక్సికో నుంచి కూడా టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నారంటే టోర్నీపై ఎంత ఆసక్తి చూపుతున్నారో అర్థమవుతుంది. తొలి విడుతలో టిక్కెట్లు కొనుగోలు చేయని అభిమానులకు మళ్లీ అవకాశం వచ్చింది. భారత్, పాక్, ఆస్ట్రేలియా వంటి ప్రత్యేకమైన మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్లు కొన్ని మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఐసీసీ మేనేజింగ్ డైరెక్టర్ స్టీవ్ ఎలవర్తి పేర్కొన్నాడు.

Story first published: Friday, March 22, 2019, 9:42 [IST]
Other articles published on Mar 22, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+