మ్యాచ్ తేదీలు: ఇంగ్లాండ్ వరల్డ్‌కప్‌లో ఆడబోయే భారత తుది జట్టిదే!

హైదరాబాద్: వన్డే వరల్డ్‌కప్‌కు ముందు టీమిండియా ఆడిన చివరి వన్డే సిరిస్‌లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో ముగిసిన ఐదు వన్డేల సిరిస్‌లో తొలి రెండు వన్డేల్లో విజయం సాధించి 2-0 ఆధిక్యంలో నిలిచిన కోహ్లీసేన... చివరి మూడు వన్డేల్లో ప్రయోగాలకు తెరలేపి ఓడిపోవడంతో... వన్డే సిరిస్‌ను 3-2తో చేజార్చుకుంది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఇటీవలే ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకుల్లో భారత క్రికెట్ జట్టు రెండో స్థానంలో నిలిచి మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆరంభమయ్యే వన్డే వరల్డ్‌కప్‌లో కోహ్లీసేన టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. వన్డేల్లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ భారత్‌కు ఎలాగైనా వరల్డ్ కప్ అందించాలనే గట్టి పట్టుదలతో ఉన్నాడు.
1983 వరల్డ్‌కప్‌లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన కపిల్ దేవ్ నాయకత్వంలోని టీమిండియా వరల్డ్‌కప్‌ను మొట్టమొదటిసారి ముద్దాడింది. ఆ తర్వాత 2011లో స్వదశంలో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో రెండోసారి వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది. వాంఖడె స్టేడియంలో సొంత ప్రేక్షకుల మధ్య శ్రీలంకతో జరిగిన ఫైనల్లో కెప్టెన్ ధోని హెలికాప్టర్ షాట్ బాది భారత్‌కు విజయాన్నందించాడు.
ప్రస్తుతం క్రికెట్ అభిమానులంతా ఐపీఎల్ 2019 సీజన్‌ను ఎంజాయ్ చేస్తున్నప్పటికీ... అందరి కళ్లు వన్డే వరల్డ్‌కప్ కోసం జట్టుని ఎప్పుడు ప్రకటిస్తారా? అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 20కి ముందే వన్డే వరల్డ్‌కప్ కోసం భారత జట్టుని ప్రకటించనున్నట్లు ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశాడు.

వరల్డ్‌కప్ కోసం జట్టుని ఎప్పుడు ప్రకటిస్తారు?
ఎమ్మెస్కే ప్రసాద్ గురువారం మీడియాతో మాట్లాడుతూ "కుటుంబ సభ్యులతో శ్రీవారి దర్శనం బాగా జరిగింది. ఇక, భారత జట్టు విషయానికి వస్తే, ఏప్రిల్ 20కి ముందే వన్డే వరల్డ్‌కప్ కోసం జట్టుని ప్రకటిస్తాం. వరల్డ్‌కప్‌కు మంచి టీమ్‌ని ఎంపిక చేస్తామని మేమెంతో ధీమాగా ఉన్నాం. వరల్డ్‌కప్ తుది జట్టు ఎంపిక కోసం ఏడాదిన్నరగా పని చేస్తున్నాం. ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లను గుర్తించామని, ఇందులో కొన్ని మంచి కాంబినేషన్స్‌ను టెస్ట్ చేశాం. మేము ఏదైతే టీమ్‌ని ఎంపిక చేస్తామో... ఆ జట్టు తప్పకుండా ఇంగ్లాండ్‌లో జరగనున్న వరల్డ్‌కప్‌లో తప్పక కప్ గెలుస్తుంది" అని ఎమ్మెస్కే ఆశాభావం వ్యక్తం చేశాడు.

ధోనికి ఇదే చివరి వరల్డ్ కపా?
అవును. ప్రస్తుతం ధోని వయసు 37 ఏళ్లు. దీంతో ఇదే ధోనికి చివరి వరల్డ్‌కప్‌గా అభిమానులు భావిస్తున్నారు. గతేడాది పేలవ ప్రదర్శన చేసిన ధోని... ఆస్ట్రేలియాతో ముగిసిన ఐదు వన్డేల సిరిస్‌లో ఫామ్‌లోకి వచ్చాడు. అంతేకాదు వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలో ధోని సలహాలు కోహ్లీకి ఎంతైనా అవసరం.

తుది జట్టు ఎంపిక ప్రక్రియ పూర్తి అయిందా?
ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరిస్‌ను 2-3తో చేజార్చుకున్న తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "తుది జట్టుపై స్పష్టత వచ్చింది. ప్రస్తుతం ఎలాంటి అయోమయం లేదు. కేవలం ఒకే ఒక్క స్థానం గురించి ఆలోచించాల్సి ఉంది. జట్టులోని మిగతా స్థానాలకు ఓకే" అని చెప్పాడు.

వరల్డ్‌కప్‌కు ఎంపికయ్యే 15 మంది జాబితా ఇదే
బ్యాట్స్‌మన్: శిఖర్ ధావన్, రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ (కెప్టెన్), అంబటి రాయుడు, రిషబ్ పంత్
వికెట్ కీపర్: ధోని, దినేశ్ కార్తీక్
ఆల్ రౌండర్లు: హార్ధిక్ పాండ్యా, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా
స్పిన్నర్లు: కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్
పేసర్లు: భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ
తుది జట్టు ఆర్డర్: 1. ధావన్ 2. రోహిత్ 3. కోహ్లీ 4. రాయుడు 5. ధోని 6. పంత్ 7. పాండ్యా 8. యాదవ్ 9. చాహాల్ 10. భువి 11. బుమ్రా

వరల్డ్‌కప్‌లో ఆడబోయే న్యూజిలాండ్ జట్టు ఇదే:
ఇంగ్లాండ్‌లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ కోసం న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే జట్టుని ఎంపిక చేసింది. న్యూజిలాండ్ జట్టు కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్ వ్యవహారించనున్నాడు.
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, ట్రెంట్ బౌల్ట్, కొలిన్ డి గ్రాండ్‌హోమ్, లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, మ్యాట్ హెన్రీ, టామ్ లాథమ్, కొలిన్ మన్రో, జిమ్మీ నీషమ్, హెన్రీ నికోల్స్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, రాస్ టేలర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications