Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ వేలం 2018: కోట్లు పలికిన ఆప్ఘన్ క్రికెటర్లు

2018 IPL Auction: 16-year-old Afghan spinner Mujeeb Zadran fetches Rs 4 crore

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో ఆప్ఘనిస్థాన్ క్రికెటర్లు కోట్లు పలికారు. తొలిరోజు జరిగిన వేలంలో ఆప్ఘన్ యువ క్రికెటర్ రషీద్ ఖాన్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా రూ. 9 కోట్లకు కొనుగోలు చేసి ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే.

ఇక, రెండో రోజైన ఆదివారం జరిగిన వేలంలో మరో ఇద్దరు క్రికెటర్లు కోట్లు పలికారు. రెండో రోజు మహమ్మద్ నబీని రూ. కోటితో సన్ రైజర్స్ దక్కించుకోగా, ఆప్ఘనిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ అయిన ముజీబ్ బద్రాన్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ. 4 కోట్లకు కొనుగోలు చేసింది.

దీంతో ఇప్పటివరకు నలుగురు అప్ఘనిస్తాన్‌ క్రికెటర్లు ఐపీఎల్‌ వేలంలో మెరిసి తమ దేశానికి వన్నె తెచ్చారు. రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ గతేడాది జరిగిన ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో రషీద్ ఖాన్ ముఖ్య భూమిక పోషించాడు.

వేలంలో ముజీబ్ జద్రాన్‌ కనీస ధర రూ. 50 లక్షలు కాగా కింగ్స్‌ పంజాబ్‌ మాత్రం వేలంలో పోటీ పడి రూ. 4 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. దాంతో ఈ ఐపీఎ‍ల్‌ వేలంలో అమ్ముడిపోయిన మూడో అప్ఘనిస్థాన్ క్రికెటర్‌గా ముజీబ్ జద్రాన్‌ నిలిచాడు.

రెండో రోజు మరో ఆప్ఘన్ ప్లేయర్‌ జహీర్‌ ఖాన్‌(రూ. 60 లక్షలు)ను రాజస్థాన్‌ రాయల్స్‌ సొంతం చేసుకుంది. జహీర్ ఖాన్ కనీస ధర రూ. 20 లక్షలు కాగా మూడు రెట్లు అధికంగా అమ్ముడుపోయాడు. జహీర్ ఖాన్‌ను రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ. రూ. 60 లక్షలకు సొంతం చేసుకుంది. దీంతో ఐపీఎల్‌ వేలంలో కొనుగోలైన నాలుగో ఆప్ఘన్ క్రికెటర్‌‌గా గుర్తింపు పొందాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, January 28, 2018, 15:21 [IST]
Other articles published on Jan 28, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+