2017 'స్పిన్నర్ల' స్పెషల్: ప్రత్యర్థులను తమ బౌలింగ్‌తో చుట్టేశారు
హైదరాబాద్: 2017 సంవత్సరం భారత స్పిన్నర్లకు బాగా కలిసొచ్చంది. ఈ ఏడాది జరిగిన ప్రతి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లోనూ బ్యాట్స్‌మెన్‌ల కంటే బౌలర్లే ప్రధాన పాత్ర పోషించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారత జట్టు తరుపున ఇద్దరు యువ స్పిన్నర్లు అరంగేట్రం చేశారు.
యజువేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్. వీరిద్దరూ మెరుగైన ప్రావీణ్యాన్ని ప్రదర్శించి అంతర్జాతీయ క్రికెట్‌లో తమ సత్తా చాటుకున్నారు. ముఖ్యంగా ప్రత్యర్ధి జట్లకు ముట్టెమటలు పోయించారు. మొత్తంగా స్పిన్నర్లు ఈ ఏడాది 153 వికెట్లను ఈ క్యాలెండర్ ఇయర్‌లో సంపాదించుకున్నారంటే ఆశ్యర్యపోవాల్సిన విషయమే.
అయితే 2017ను ఎంతో ఘనంగా ముగించిన భారత స్పిన్నర్లకు 2018 మాత్రం పరీక్షా కాలం కానుంది. ఎందుకంటే 2018లో టీమిండియా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా దేశాల పర్యటనకు వెళ్లనుంది. కోహ్లీసేన దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా కోహ్లీసేన మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడనుంది.
ఈ సిరిస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికాల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జనవరి 5న ప్రారంభం కానుంది. బలమైన ప్రత్యర్థులైన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్టులతో పోటీ పడనున్న నేపథ్యంలో భారత్ బౌలర్లకు 2018 క్లిష్ట సమయంగా మారింది.

అశ్విన్
తమిళనాడుకు చెందిన ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ఈ ఏడాదితో 300టెస్ట్ వికెట్లను సొంతం చేసుకున్నాడు. ఈ రికార్డు లెజెండ్ బౌలర్ అయిన డెనిస్ లిల్లె రికార్డు రెండు పాయింట్లు తక్కువ అంతే.

రవీంద్ర జడేజా
ఎడమ చేతి వాటం కలిగిన రవీంద్ర జడేజా ఈ ఏడాది పరవాలేదనిపించుకున్నాడు. జేమ్స్ అండర్‌సన్, కైగిసో రబడ వంటి అద్భుతమైన క్లబ్‌లో చేరిపోయాడు. చాహల్, యాదవ్‌లు జట్టులోకి చేరడంతో జడ్డూకి స్థానం లేకుండా పోయింది.

యజువేంద్ర చాహల్
లెగ్ స్పిన్నర్ అయిన యజువేంద్ర చాహల్ ఐపీఎల్, టీ20, వన్డే మ్యాచ్ లు మూడింటిలోనూ బ్యాట్స్‌మెన్‌లపై విరుచుకుపడ్డాడు. గతేడాది జింబాబ్వేతో జరిగిన సిరీస్ అనంతరం తన గ్రాఫ్ పైకి లేస్తూనే ఉంది.

కుల్దీప్ యాదవ్
శ్రీలంకతో జరిగిన టెస్ట్, వన్డే, టీ20లలో బౌలర్ల ప్రధాన పాత్ర వహించి లంక ప్లేయర్లను గడగడలాడించారు. ఫలితంగా ఖాళీ చేతులతో తిరిగివెళ్లేలా చేశారు. యాదవ్ ఆడిన 14మ్యాచ్‌లలో 22వికెట్లను తీసి ఔరా అనిపించుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications