ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన మిస్బా (వీడియో)
హైదరాబాద్: పాకిస్థాన్ టెస్టు కెప్టెన్ మిస్బా ఉల్ హక్ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టాడు. హాంకాంగ్‌లో టీ20 బ్లిట్జ్ టోర్నీలో భాగంగా గురువారం హాంగ్ హన్ జేడీ జాగ్వార్స్- హాంకాంగ్ ఐస్లాండ్ యునైటెడ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుత సన్నివేశం చోటు చేసుకుంది.
ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు
హాంకాంగ్ ఐస్లాండ్ యునైటెడ్ జట్టు తరుపున ఆడుతున్న మిస్బా వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో మిస్బా 37 బంతుల్లో 82 పరుగులు చేసిన మిస్బా నాటౌట్‌గా నిలిచాడు. దీంతో యునైటెడ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది.

20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 183 పరుగులు
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జాగ్వార్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. దీంతో జాగ్వార్స్‌పై యునైటెడ్ జట్టు 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్‌లో జాగ్వార్స్ బౌలర్ ఇమ్రాన్ ఆరిఫ్ వేసిన ఓవర్లో చివరి రెండు బంతులను మిస్బా సిక్సులుగా మలిచాడు.

ఆరు సిక్సర్లు సాధించిన ఆటగాడిగా మిస్బా రికార్డు
ఆ తర్వాతి క్యాడీ వేసిన ఓవర్లోనూ మొదటి నాలుగు బంతులను సిక్స్‌లుగా మలిచడంతో తాను వరుసగా ఎదుర్కొన్న ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు సాధించిన ఆటగాడిగా మిస్బా రికార్డు నెలకొల్పాడు. కాగా, టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌పై టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టిన సంగతి తెలిసిందే.

మిస్బా ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టాడిలా:
18.5: ఇమ్రాన్ ఆరిఫ్ టు మిస్బా - పుల్ టాస్ బాల్ లెగ్ స్వేర్ మీదుగా సిక్స్
18.6: ఇమ్రాన్ ఆరిఫ్ టు మిస్బా - లాంగ్ ఆన్ మీదుగా భారీ సిక్స్
19.2: క్యాడీ టు మిస్బా- షార్ట్ డెలివరీ, ఫైన్ లెగ్ మీదుగా సమయం తీసుకుని సిక్స్
19.3: క్యాడీ టు మిస్బా- మరో షార్ట్ డెలివరీ, మళ్లీ సిక్స్
19.4: క్యాడీ టు మిస్బా- మళ్లీ సిక్స్
19.5: క్యాడీ టు మిస్బా- పుల్ లెంగ్త్ బాల్, అయినా సరే లెక్కచేయకుండా సిక్స్ కొట్టిన మిస్బా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications