టీ20 వరల్డ్ కప్ కోసం ట్విట్టర్, ఐసీసీ కొత్త ఎమోజీలు
బెంగుళూరు: భారత్‌లో మార్చి 8 నుంచి ప్రారంభమైన వరల్డ్ టీ20 కోసం ఐసీసీతో కలిసి ట్విట్టర్ కొత్తగా ఎమోజిల్ని, ట్రంప్ కార్డులను విడుదల చేసింది. వరల్డ్ టీ20లో భాగంగా ట్విట్టర్ విడుదల చేసిన ట్రంప్ కార్డులు (#WorldT20Heroes), #AskCaptainలను కొత్త కార్యక్రమాలుగా పేర్కొంది.
ఈ సందర్భంగా ట్విట్టర్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ క్రికెట్ అభిమానుల కోసం వారి ఫేవరేట్ క్రికెట్ హీరోలతో కూడిన కొత్త ట్రంప్ కార్డ్‌లు, స్మైలీలు విడుదల చేశామని అన్నారు. ట్రంప్ కార్డుల కోసం ఐసీసీ తమకు సహాయపడిందని చెప్పారు.

ఒక్కొక్క ఆటగాడికి ఒక్కొక్క ట్రంప్ కార్డు ఉంటుందని వాటిని పొందిన అభిమానులు ఆ ఆటగాడికి సంబంధించిన తాజా గణాంకాలన్నింటినీ పొందవచ్చని అన్నారు. వరల్డ్ టీ20 టోర్నమెంట్‌లో పాల్గొనే అన్ని జట్ల ఆటగాళ్లకూ ట్రంప్ కార్డులు ఉంటాయని 'ట్విట్టర్' ప్రతినిధులు పేర్కొన్నారు.
అభిమానుల కోసం ట్విట్టర్‌లో #OnlyOnTwitter కొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పారు. ఓ అంతర్జాతీయ టోర్నమెంట్ కోసం ట్విట్టర్, ఐసీసీ సంయుక్తంగా ఎమోజీలను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. క్రికెట్ అభిమానులు ట్వీట్ చేసే సమయంలో వారి ట్వీట్ పక్కన #WT20 or #AskCaptain or #WT20Heroes అని చేరిస్తే ఎమోజీలు కనిపిస్తాయని చెప్పారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications