న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌పై ఎదురుదాడి చేయాలనుకున్నా.. ఇదే విషయం 12వ ఆటగాడికి చెప్పా: పాంటింగ్‌

2003 World Cup Final: Ricky Ponting shares about playing tactis against TeamIndia

మెల్‌బోర్న్‌: 2003 ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై ఎదురుదాడి చేయాలనుకున్నా అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ చెప్పారు. దూకుడుగా ఆడి భారత్‌ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలనే ఉద్దేశంతో ఎదురుదాడి చేయాలనుకున్నా, ఇదే విషయాన్ని డ్రింక్స్‌ తీసుకొచ్చిన 12వ ఆటగాడికి చెప్పి తర్వాతి బ్యాట్స్‌మెన్‌ను సిద్ధంగా ఉండమన్నా అని తెలిపారు. 2003 ప్రపంచకప్‌లో భారత్ వరుస విజయాలతో ఫైనల్‌కు చేరి ఆసీస్‌ చేతిలో ఓటమిపాలైంది.

భారత ఆటగాళ్లకు త్వరలో డిజిటల్‌ తరగతులు: కిరణ్ రిజుజుభారత ఆటగాళ్లకు త్వరలో డిజిటల్‌ తరగతులు: కిరణ్ రిజుజు

ఎదురుదాడి చేయాలనుకున్నా:

ఎదురుదాడి చేయాలనుకున్నా:

2003 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగి ఆదివారం నాటికి 17 ఏళ్లు గడిచాయి. ఈ సందర్భంగా పాంటింగ్‌ నాటి విశేషాల్ని గుర్తు చేసుకున్నారు. క్రికెట్‌.కామ్‌.ఏయూ పోస్టు చేసిన వీడియోలో పాంటింగ్‌ మాట్లాడారు. 'మేం మొదటగా బ్యాటింగ్‌ చేస్తుండగా.. రెండో డ్రింక్స్‌ సమయానికి ఆసీస్‌ రెండు వికెట్లు కోల్పోయింది. ఇంకా 15 ఓవర్ల ఆట మిగిలుంది. అప్పుడు డ్రింక్స్‌ తీసుకొచ్చిన 12వ ఆటగాడికి.. తర్వాతి బ్యాట్స్‌మెన్‌ను సిద్ధంగా ఉండమని చెప్పమని చెప్పా. ఎందుకంటే అప్పటి నుంచి ఎదురుదాడి చేయాలనుకున్నా' అని పాంటింగ్‌ తెలిపారు.

భారత్ బౌలింగ్‌పై 300 స్కోర్‌ సాధిస్తే:

భారత్ బౌలింగ్‌పై 300 స్కోర్‌ సాధిస్తే:

'ఒకవేళ నేను అనుకున్నట్లు జరిగితే ఆసీస్‌కు భారీ స్కోర్‌ వస్తుందని ఆశించా. భారత్ బౌలింగ్‌పై 300 స్కోర్‌ సాధిస్తే.. నాకు సంతోషంగా ఉండేది కాదు. నేను అనుకున్నట్లు ఆడితే.. భారత్‌ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించొచ్చు అని అనుకున్నా. అయితే నేను అనుకున్నట్టే జరిగింది. ఎదురుదాడి చేయడంతో భారీ స్కోర్ సాధించాం. గిల్‌క్రిస్ట్‌, హెడెన్‌ మంచి ఆరభంబాన్ని ఇచ్చారు. మార్టిన్ గొప్పగా ఆడాడు' అని పాంటింగ్‌ పేర్కొన్నారు. రికీ పాంటింగ్‌ (140; 121 బంతుల్లో 4x4, 8x6) భారీ సెంచరీ చేసాడు.

భారత బౌలర్లపై ఎదురుదాడి:

భారత బౌలర్లపై ఎదురుదాడి:

2003 ప్రపంచకప్‌ ఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 359 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. గిల్‌క్రిస్ట్‌ (57), హెడెన్‌ (37) తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించారు. గిల్‌క్రిస్ట్‌,హెడెన్‌ పెవిలియన్‌ చేరినా.. పాంటింగ్‌ (140), మార్టిన్‌ (88; 84 బంతుల్లో 7x4, 1x6) చెలరేగిపోయారు. లక్ష్య ఛేదనలో భారత్‌ 234 పరుగులకే ఆలౌటైంది. వీరేందర్ సెహ్వాగ్‌ (82)ఒక్కడే పోరాడాడు. సచిన్, గంగూలీలు త్వరగానే పెవిలియన్ చేరడంతో భారత్ పరుగులు చేయలేకపోయింది. భారత్ 125 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది.

Story first published: Wednesday, March 25, 2020, 9:15 [IST]
Other articles published on Mar 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X