కుంబ్లే కోసం గంగూలీ 'కెప్టెన్సీ' త్యాగం! సెహ్వాగ్ గురించీ
కోల్‌కతా: 2003-04లో అనిల్ కుంబ్లే కోసం తాను తన కెప్టెన్సీని పణంగా పెట్టానని భారత క్రికెట్ మాజీ సారథి సౌరవ్ గంగూలీ చెప్పాడు. ఆటగాడు కష్టాలలో ఉన్న సమయంలో సారథి అండగా నిలబడాలని సూచించాడు. అప్పుడే అతడిపై మిగతా జట్టు సభ్యులకు నమ్మకం కలుగుతుందన్నాడు.
2003-04 ఆస్ట్రేలియా పర్యటనకు ఫాంలో లేని కుంబ్లే స్థానంలో మురళీ కార్తీక్‌ను ఎంపిక చేస్తామని సెలక్టర్లు చెప్పారు. విదేశాల్లో కుంబ్లే వికెట్లు తీయలేడని చెప్పారన్నారు. అయితే, దానికి తాను ఒప్పుకోలేదని, కుంబ్లే లేకుంటే పర్యటనకు వెళ్లేదే లేదని ఖరాఖండిగా చెప్పానన్నాడు.

సమావేశం రాత్రి రెండు గంటలకు వరకు సాగిందని, చివరకు సెలక్టర్లు అంగీకరించారని గుర్తు చేసుకున్నాడు. అయితే ఓ షరతు పెట్టారని, కుంబ్లే విఫలమైతే తనను సారథిగా తప్పిస్తామని చెప్పారని, కానీ ఆ పర్యటన అత్యుత్తమంగా నిలిచిందని గుర్తు చేసుకున్నాడు.
1-1తో సిరీస్‌ను డ్రా చేసుకున్నామని, ముఖ్యంగా ఆ సిరీస్‌లో అనిల్ కుంబ్లే 24 వికెట్లు తీశాడన్నాడు. అదే సమయంలో డ్రెస్సింగ్ రహస్యాలు కూడా తెలిపాడు. సెహ్వాగ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పాటలు పాడుకుంటాడని గంగూలీ చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications