Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాట్‌వెస్ట్ ట్రోఫీలో స్లెడ్జింగ్: కైఫ్‌ను బస్సు డ్రైవర్‌ అన్నది ఎవరో తెలుసా?

2002 NatWest Trophy: When Nasser Hussain sledged Mohammad Kaif with bus driver jibe

హైదరాబాద్: ఇటీవల కాలంలో క్రికెట్‌లో స్లెడ్జింగ్ అనేది మాములు అయిపోయింది. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ల ఏకాగ్రతను మాటలతో దెబ్బతీయడాన్నే స్లెడ్జింగ్ అంటారు. 2002 నాట్‌వెస్ట్‌ సిరీస్‌ ఫైనల్లో ఇంగ్లాండ్‌ జట్టు కెప్టెన్ తనను బస్సు డ్రైవర్ అంటూ స్లెడ్జింగ్‌ చేసినట్లు టీమిండియా వెటరన్ క్రికెటర్ మహమ్మద్‌ కైఫ్‌ తెలిపాడు.

తాజాగా కైఫ్‌ ట్విటర్‌ ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఈ సందర్భంగా 2002 నాట్‌వెస్ట్‌ సిరీస్‌ ఫైనల్లో ఇంగ్లాండ్‌ ఆటగాడు ఎవరైనా స్లెడ్జింగ్‌ చేశారా? అని అడగ్గా.. 'ఔను.. నాసిర్‌ హుస్సేన్‌ స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. ఆ సమయంలో నన్ను అతడు బస్‌ డ్రైవర్‌ అని పిలిచాడు. దీంతో నేను, యువరాజ్‌ సింగ్‌ కలిసి మ్యాచ్‌ అనంతరం రైడ్‌కు తీసుకెళ్తాం అని దీటుగా బదులిచ్చాం' అని కైఫ్ అప్పటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు.

2002లో నాట్‌వెస్ట్ టోర్నీ పైనల్ ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగింది. ఈ ఫైనల్స్‌లో భారత్-ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని చేధించడం కష్టం అని అనుకున్నారంతా.

అయితే, అంతటి భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్‌లు చక్కటి శుభారంభాన్నిచ్చారు. అయితే గంగూలీ ఔటైన తర్వాత టీమిండియా వరుసగా వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన యువరాజ్ సింగ్, మహమ్మద్ కైఫ్‌లు నిలకడగా ఆడి భారత్‌కు విజయాన్ని కట్టబెట్టారు.

వీరిద్దరి అద్భుతమైన ఇన్నింగ్స్‌తో నాట్ వెస్ట్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది. భారత క్రికెట్ చూసిన అత్యుత్తమ ఫీల్డర్లలో మహమ్మద్ కైఫ్ ఒకడు. ప్రత్యర్ధి జట్ల బ్యాట్స్‌మెన్‌లను రనౌట్లు చేయడంలో దిట్ట. అంతేకాదు తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లు పట్టిన మహమ్మద్ కైఫ్‌ 2006లో రిటైర్మెంట్ ప్రకటించాడు.

అభిమానులు అడిగిన ప్రశ్నలకు కైఫ్‌ సమాధానాలు ఇలా ఉన్నాయి:


* ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు బెస్ట్‌ కెప్టెన్‌ ఎవరని అనుకుంటున్నారు?
మహేంద్ర సింగ్‌ ధోని


* మీ అభిమాన బ్యాట్స్‌మన్‌?
సచిన్‌ టెండూల్కర్


* మీ ఫేవరెట్‌ ఫీల్డర్‌?
జాంటీ రోడ్స్‌.


* మీ అభిమాన సినీ నటి?
కాజోల్‌


* మీరందుకున్న గొప్ప కాంప్లిమెంట్‌ ఏమిటి?
ఈ మధ్య స్విట్జర్లాండ్‌లో పాక్‌ దిగ్గజ క్రికెటర్‌ వసీం అక్రమ్‌ నన్ను ఉద్దేశించి.. 'ఒకప్పటి లెజండరీ ఫీల్డర్‌, ఎప్పటికీ లెజండరీ ఫీల్డర్‌, ఫినిషరే' అని అన్నాడు.


* మీ ఆల్‌టైం భారత వన్డే జట్టు?
సచిన్‌, సెహ్వాగ్‌, గంగూలీ, విరాట్‌ కోహ్లీ, యువరాజ్‌ సింగ్‌, మహేంద్ర సింగ్‌ ధోనీ, కపిల్‌ దేవ్‌, హర్భజన్‌ సింగ్‌, జహీర్‌ ఖాన్‌, అనిల్‌ కుంబ్లే, జవగళ్‌ శ్రీనాథ్‌.


* భవిష్యత్తులో భారత జట్టుకు ఫీల్డింగ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపడతారా?
అవకాశం వస్తే తప్పకుండా


Story first published: Wednesday, February 28, 2018, 13:03 [IST]
Other articles published on Feb 28, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+