పొలాక్ చేసిన అద్భుత ఫీట్‌కి 20 ఏళ్ళు
న్యూఢిల్లీ: క్రికెట్ ని అమితంగా ఇష్టపడే అభిమానులకు కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు షాన్ పొలాక్.. అంతర్జాతీయ క్రికెట్ లో తనదైన మార్క్ బౌలింగ్ తో దక్షిణాఫ్రికాకి ఎన్నో ఒంటి చేతి విజయాలను కట్టబెట్టాడు ఈ మాజీ ఆల్ రౌండర్.
మూడేళ్ళ పాటు కెప్టెన్ గాను సౌతాఫ్రికాని ముందుండి నడిపించిన పొలాక్.. అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టకముందు, 20 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున కౌంటీ క్రికెట్ లో ఓ అద్భుత ఫీట్ ని సాధించాడు.

ఇంతకీ విషయమేంటంటే..! పొలాక్ కౌంటీలో ఆడిన తొలి మ్యాచ్ లోనే 10 ఓవరల్లో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇందులో 5 మేడిన్ ఓవర్లు ఉండడం.. 4 వరుస బంతుల్లో 4 వికెట్లు పడగొట్టడం పొలాక్ అసమాన ప్రతిభకి నిదర్శనం.
ఇదే విషయాన్ని ట్విట్టర్ లో అభిమానులతో పంచుకున్నాడు పొలాక్. తాను ఆడిన తొలి కౌంటీ మ్యాచ్ లోనే ఇలాంటి అరుదైన ఫీట్ సాధించడం ఓ గొప్ప అనుభూతి అని, ఆ ఫీట్ చేసిన రోజు తాను వేసి ప్రతి బంతికి తనకు కలిగిన భావోద్వేగాలు ఇప్పటికీ గుర్తున్నాయని ట్వీట్ చేశాడు. లీచెస్టర్ షైర్ టీమ్ తో 1996, ఏప్రిల్ 26న జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్ లో పొలాక్ ఈ అద్భుతాన్ని ఆవిష్కరించాడు.
Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications