రెండేళ్ల క్రితం లంక ఆటగాళ్లకు వాంతులు: వద్దని హెచ్చరిస్తున్నా బీసీసీఐ పంతానికి పోతుందా?

హైదరాబాద్: ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో శుక్రవారం ప్రభుతం పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. దీంతో భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆదివారం జరగనున్న తొలి టీ20పై వాయు కాలుష్యం తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని వాతావరణ నిపుణులు అంటున్నారు.
అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ నిర్వహించవద్దని పర్యావరణవేత్తలు హెచ్చరించినప్పటికీ బీసీసీఐ ఎందుకు పట్టుదలకు పోతుందో అర్ధం కావడం లేదని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ కాలుష్యం కారణంగా తొలి టీ20లో ఇరు జట్ల క్రికెటర్లు వాయు కాలుష్యం బారిన పడి ఏమైనా సమస్యలకు లోనైతే ఏమి చేయాలని డీడీసీఏ కలవరపడుతోంది.

గాలి నాణ్యత గణనీయంగా తగ్గింది
శుక్రవారం ఢిల్లీలో గాలి నాణ్యత గణనీయంగా తగ్గింది. మూడు రోజుల క్రితం ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక 357గా నమోదైంది. అయితే, శుక్రవారానికి గాలి నాణ్యత సూచిక 400 దాటింది. దీంతో ప్రభుత్వం పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. నిజానికి గాలి నాణ్యత సూచిక 400 దాటితే తీవ్ర శ్వాసకోశ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.

ప్రజలను అవరసమైతే తప్పితే
ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ప్రజలను అవరసమైతే తప్పితే బయటకు వెళ్లవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో క్రికెటర్లు ఎలా ఆడతారనే సందేహాలు నెలకొన్నాయి. దీపావళి పండుగ నేపథ్యంలో గాలి నాణ్యత మరింత దిగజారింది. ఢిల్లీలో కాలుష్యం తగ్గేంత వరకు ఎటువంటి మ్యాచ్‌లను నిర్వహించరాదని మాజీ క్రికెటర్ గంభీర్ అన్న సంగతి తెలిసిందే.
గంగూలీ మాత్రం షెడ్యూల్ ప్రకారమే
అయితే, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మాత్రం షెడ్యూల్ ప్రకారం తొలి టీ20 జరుగుతుందని స్పష్టం చేశారు. శీతకాలంలో డిల్లీలో మ్యాచ్‌లు నిర్వహించొద్దని ఎప్పటినుండో డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ... రొటేషన్ పాలసీ ప్రకారమే తొలి టీ20ని ఢిల్లీకి కేటాయించాల్సి వచ్చింది. అయితే, శుక్రవారం గాలి నాణ్యత గణనీయంగా తగ్గడంతో గంగూలీ కూడా ఏమి చేయలేకపోతున్నాడు.

వేదికను మార్చాలనుకున్నప్పటికీ
వేదికను మార్చాలనుకున్నప్పటికీ చివరి నిమిషంలో అలా చేయడం అంత సులువు కాదనే విషయం అందరికీ తెలిసిందే. మరోవైపు బంగ్లాదేశ్ క్రికెటర్లు పొల్యూషన్ మాస్క్‌లు ధరించి అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే, ఢీల్లీలో క్రికెటర్లు వాయు కాలుష్యం బారిన పడటం ఇదేమి తొలిసారి కాదు.

శ్రీలంక క్రికెటర్లకు వాంతులు
అంతకముందు భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక క్రికెటర్లు సైతం ఇదే తరహాలో ఇబ్బందులు పడ్డారు. 2017లో వాతావరణ కాలుష్య ప్రభావాన్ని తట్టుకోలేని కొంతమంది శ్రీలంక క్రికెటర్లు మైదానంలోనే వాంతులు కూడా చేసుకున్న సందర్భాన్ని మనం చూశాం. మరికొందరు అయితే మ్యాచ్ మధ్యలో అస్వస్థతకు లోనయ్యారు.

బీసీసీఐ పెద్దలు ఏం చేస్తున్నట్లు!
నిజానికి అక్టోబర్ మరియు డిసెంబర్ మధ్య కాలంలో ఢిల్లీలో గాలి నాణ్యత గణనీయంగా తగ్గుతుంది. శీతాకాలం సమీపించడం, దీపావళి టపాసులే ఇందుకు ప్రధాన కారణం. అయితే, ఈ విషయం తెలిసి కూడా బీసీసీఐ ఢిల్లీకి ఈ కాలంలో మ్యాచ్‌లను ఎందుకు కేటాయిస్తుందో ఎవరికీ అర్ధం కావడం లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications