Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మైదానంలోకి పాములు.. మ్యాచ్‌కు అంతరాయం!!

Ranji Trophy 2019-20 : 2 Snakes Interrupt Mumbai Vs Karnataka Match ! || Oneindia Telugu
2 snakes interrupt Mumbai vs Karnataka Ranji Trophy match

ముంబై: వర్షం కారణంగానో లేదో సరైన వెలుతురు లేని కారణంగానో ఒక క్రికెట్‌ మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడుతుంది. అప్పుడప్పుడు ఒక ఆటగాడు గాయపడిన సందర్భాల్లో మ్యాచ్‌ కొంత సమయం నిలిచిపోతుంది. అయితే పాముల కారణంగా మ్యాచ్‌ చాలాసేపు ఆగిపోవడం విశేషం. ముంబై-కర్ణాటక జట్ల మధ్య ఆదివారం జరిగిన రంజీ మ్యాచ్‌లో రెండు సార్లు పాములు కలకలం సృష్టించాయి. దీంతో మూడో రోజు ఆటకు అంతరాయం కలిగింది.

ముంబై-కర్ణాటక జట్ల మధ్య ఆదివారం ఆటలో భాగంగా నగరంలోని బంద్ర కుర్లా కాంప్లెక్స్‌ స్టేడియంలో రెండు పాములు రావడంతో మ్యాచ్‌ చాలాసేపు నిలిచిపోయింది. చివరకు స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం ఇవ్వడంతో వాటిని పట్టుకున్నాడు. అయితే, ఇవి విషపూరితమైనవి కావని వారు తెలిపారు. పాములు కారణంగా మ్యాచ్‌ను కొంతసేపు ఆపాల్సి వచ్చింది.

గత నెల విజయవాడలో జరిగిన ఆంధ్ర, విధర్భ జట్ల మధ్య రంజీ మ్యాచ్‌లోనూ ఒక పాము మైదానంలోకి ప్రవేశించింది. మైదానం సిబ్బంది దాన్ని బయటకు తరలించడంతో.. ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. పాములు కారణంగా మ్యాచ్‌లు చాలాసేపు ఆగిపోవడం గత కొంతకాలంగా రంజీ మ్యాచ్‌ల్లో జరుగుతూనే ఉంది. దీంతో మైదానం సిబ్బంది ఎంత జాగ్రత్తగా ఉన్నారో తెలుస్తోంది.

ఈ రంజీ మ్యాచ్‌ ఏకపక్షంగా సాగింది. కర్ణాటక ఐదు వికెట్ల తేడాతో విజయం సాదించింది. ముంబై నిర్దేశించిన 126 పరుగుల లక్ష్యంను కర్ణాటక తన రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కర్ణాటక ఓపెనర్లు ఆర్‌ సమరత్‌ (34), దేవ్‌దూత్‌ పడిక్కల్‌ (50)లు మంచి ఆరంభాన్నిచ్చి కర్ణాటక ఓజయంలో కీలక పాత్ర పోషించారు. ముంబైకి ఇది రెండో ఓటమి.

Story first published: Monday, January 6, 2020, 9:37 [IST]
Other articles published on Jan 6, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+