For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టుల్లో ఐదో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసిన వెస్టిండిస్

By Nageshwara Rao
1st Test: West Indies record fifth-largest Test win for series lead

హైదరాబాద్: ఆంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో వెస్టిండిస్‌ ఇన్నింగ్స్‌ 219 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో వెస్టిండిస్ జట్టు టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఐదో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను 43 పరుగులకే ఆలౌట్ చేసిన వెస్టిండిస్, రెండో ఇన్నింగ్స్‌లో 144 పరుగులకు ఆలౌట్‌ చేసింది.

ఇక, వెస్టిండిస్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 406 పరుగులు చేయడంతో స్వదేశంలో అతి పెద్ద విజయాన్ని తొలిసారి నమోదు చేసింది. ఇప్పటివరకూ వెస్టిండిస్‌ సాధించిన భారీ విజయాలు పరంగా చూస్తే.. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌పై ఇన్నింగ్స్‌ 336 పరుగుల తేడాతో సాధించిన గెలుపు తొలి స్థానంలో ఉంది.

1
43699

ఆ తర్వాత న్యూజిలాండ్‌తో వెల్టింగ్టన్‌లో ఇన్నింగ్స్‌ 322 పరుగుల తేడాతో సాధించిన విజయం రెండో స్థానంలో ఉంది. ఇక, మూడో స్థానంలో బంగ్లాదేశ్‌పై ఢాకాలో సాధించిన ఇన్నింగ్స్‌ 310 పరుగుల తేడాతో సాధించిన విజయం ఉండగా, ఇంగ్లండ్‌పై లార్డ్స్‌లో సాధించిన ఇన‍్నింగ్స్‌ 226 పరుగుల తేడాతో నమోదు చేసిన విజయం నాలుగో స్థానంలో ఉంది.

బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో వెస్టిండిస్ సాధించిన విజయం మొత్తంగా ఆ జట్టు చరిత్రలో ఐదో అతి పెద్ద విజయంగా నిలిచింది. తొలి టెస్టులో విజయం సాధించడంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో వెస్టిండిస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జులై 12(గురువారం) నుంచి ప్రారంభం కానుంది.

టెస్టు మ్యాచ్ వివరాలు:
తొలి ఇన్నింగ్స్:
బంగ్లాదేశ్: 43 ఆలౌట్
వెస్టిండిస్: 406

రెండో ఇన్నింగ్స్:
బంగ్లాదేశ్: 144 ఆలౌట్

Story first published: Saturday, July 7, 2018, 15:46 [IST]
Other articles published on Jul 7, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+