
హైదరాబాద్: చిట్టగాంగ్ వేదికగా పర్యాటక వెస్టిండిస్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ ఆఫ్ స్పిన్నర్ నయీమ్ హసన్ చరిత్ర సృష్టించాడు. అరంగేట్ర టెస్ట్‌లో ఐదు వికెట్లు తీసిన అత్యంత పిన్న వయసు బౌలర్‌గా నయీమ్ హసన్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.
17 ఏళ్ల 355 రోజుల వయసున్న నయీమ్ వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో 61 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండిస్ జట్టు 246 పరుగులు చేసి ఆలౌటైంది. ఇదిలా ఉంటే అరంగేట్ర టెస్ట్‌లోనే సెంచరీ చేసిన అత్యంత పిన్న వయసు బ్యాట్స్‌మన్ రికార్డు కూడా బంగ్లాదేశ్ పేరిటే ఉంది.
బంగ్లాదేశ్ ఆటగాడు మహ్మద్ అష్రఫుల్ 17 ఏళ్ల 61 రోజుల వయసులో అరంగేట్రం చేసి తొలి టెస్ట్‌లోనే సెంచరీ చేశాడు.