Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గాలె టెస్టు: ప్రపంచ రికార్డు నెలకొల్పిన శ్రీలంక స్పిన్నర్

హైదరాబాద్: గాలే వేదికగా తొలి టెస్టులో బంగ్లాదేశ్‌పై 259 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. ఈ టెస్టులో శ్రీలంక స్పిన్నర్ రంగనా హెర్నాత్ ప్రపంచ రికార్డుని సృష్టించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీయడంతో 23 సార్లు ఐదుకుపైగా వికెట్లు తీసిన ఘనతను సాధించాడు.

మరోవైపు టెస్టు క్రికెట్‌లో లెప్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. అంతకముందు న్యూజిలాండ్ బౌలర్ డానియేల్ వెటోరి 362 వికెట్లు తీసుకుని అగ్రస్ధానంలో ఉన్నాడు. గాలె టెస్టులో రంగనా హెర్నాత్ మొత్తం 9 వికెట్లు తీయడంతో హెర్నాత్ వికెట్ల సంఖ్య 366కు చేరింది.

గాలె టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 494 పరుగులు చేసింది. మరోవైపు మెండిస్ 19 ఫోర్లు, 4 సిక్సులతో ఉపుల్ తరంగా 194 పరుగులు చేసి సెంచరీని తృటిలో మిస్సయ్యాడు. అనంతరం బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులకే ఆలౌటైంది.

దీంతో తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంకకు 182 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం శ్రీలంక తన రెండో ఇన్నింగ్స్‌ను 274 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. ఈ టెస్టులో శ్రీలంక ఓపెనర్ ఉపుల్ తరంగ సెంచరీ (115) సాధించాడు. ఉపుల్‌ తరంగ టెస్టుల్లో అరంగేట్రం చేసిన 11 ఏళ్లకు సొంతగడ్డపై తొలి సెంచరీ సాధించడం విశేషం.

డిసెంబర్‌ 18, 2005లో భారత్‌పై అరంగేట్రం చేసిన అతడు ఇప్పటి వరకు టెస్టుల్లో మూడు సెంచరీలు సాధించాడు. అందులో మొదటిది బంగ్లాదేశ్‌పై 2006లో చేయగా, రెండోది జింబాబ్వేపై 2016లో చేశాడు. శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌ను 274/6 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది.

దీంతో 456 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 60.2 ఓవర్లలో 197 పరుగులకే ఆలౌటైంది. మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డు మెండిస్‌‌కు లభించింది. దీంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను శ్రీలంక 1-0తో ముందంజలో ఉంది.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+