మార్నింగ్ సెషన్ హైలెట్స్: వార్నర్ నోబాల్, కడుపునొప్పితో రెన్‌షా రిటైర్డ్ హర్ట్
హైదరాబాద్: పూణె వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా లంచ్ విరామానికి ఒక వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో షాన్‌మార్ష్ 1, స్టీవెన్ స్మిత్ 1 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా బౌలర్లలో ఉమేశ్ యాదవ్‌కు ఒక వికెట్ దక్కింది.
ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆరంభంలోనే అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 15 ఓవర్ చివరి బంతికి వార్నర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జయంత్ యాదవ్ వేసిన ఆ ఓవర్ ఆఖరి బంతికి వార్నర్ బౌల్డ్ అయినప్పటికీ, అది నో బాల్ అయ్యింది.
అవుట్ నుంచి తప్పించుకున్న వార్నర్
దాంతో వార్నర్ అవుట్ నుంచి తప్పించుకున్నాడు. ఈ సమయంలో కోహ్లీ సైతం అసహనం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత ఉమేశ్ యాదవ్ వేసిన 28 ఓవర్ రెండో బంతికి వార్నర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 82 పరుగుల వద్ద ఆసీస్ తొలి వికెట్‌ను కోల్పోయింది. వార్నర్ అవుటైన తర్వాత షాన్ మార్ష్ క్రీజులోకి వచ్చాడు
కడుపు నొప్పితో రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ కు చేరిన ఓపెనర్ రెన్‌షా
మరొ ఓపెనర్ రెన్ షా 36 పరుగుల వద్ద కడుపు నొప్పి రావడంతో రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాడు.
నిలకడగా ఆడుతున్న ఆసీస్
పూణె వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. 13 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ కోల్పోకుండా 29 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ 16, మ్యాట్ రెన్షా 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.
rn#TeamIndia Captain @imVkohli and Vinod Rai, Chairman CoA unveiled a postal stamp to commemorate the first Test at MCA in Pune #INDvAUS pic.twitter.com/3igOpYJXET
— BCCI (@BCCI) 23 February 2017
పోస్టల్ స్టాంప్ ఆవిష్కరించిన కోహ్లీ
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, సీవోఏ ఛైర్మన్ వినోద్ రాయ్‌లు గురువారం ఉదయం పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. పుణెలోని ఎంసీఏ మైదానంలో జరుగుతున్న తొలి టెస్టు జ్ఞాపకార్థంగా తపాళా బిళ్లను ఆవిష్కరించారు. అంతేకాకుండా పుణెలోని ఎమ్‌సీఏ మైదానం దేశంలో టెస్టు మ్యాచ్‌లు ఆడే 25వ వేదికగా గుర్తింపును సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య పూణెలో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బాగా డ్రైగా ఉందని, బౌన్స్‌కు అవకాశం ఉండదన్న ఉద్దేశంతో బ్యాటింగ్ తీసుకున్నామని టాస్ గెలిచిన అనంతరం స్టీవ్ స్మిత్ తెలిపాడు. టీ20 మ్యాచ్‌లకు, టెస్టులకు చాలా తేడా ఉందని, ఈ టెస్టు సిరీస్‌కు బాగా ప్రాక్టీస్ చేశామని చెప్పాడు. ఆసీస్ తరుపున ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఆల్ రౌండర్లతో బరిలోకి దిగుతున్నట్టు చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications