
96 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న మోమినుల్‌కు కెరీర్‌లో ఇది ఐదో సెంచరీ కావడం విశేషం. మాజీ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ (192 బంతుల్లో 92; 10 ఫోర్లు) త్రుటిలో సెంచరీ అవకాశం కోల్పోగా, తమీమ్ ఇక్బాల్ (52) రాణించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ (52), ఇమ్రూల్ కైస్ (40) తొలి వికెట్‌కి 72 పరుగులతో చక్కటి శుభరంభాన్నిచ్చారు. హాఫ్ సెంచరీ అనంతరం ఇక్బాల్ ఔటవగా.. క్రీజులోకి వచ్చిన హక్ శ్రీలంక బౌలర్లని చాలా ఓపికగా ఎదుర్కొన్నాడు. అనంతరం క్రీజులో కుదురుకున్న తర్వాత వరుస బౌండరీలతో రెచ్చిపోయాడు.
జట్టు స్కోరు 120 వద్ద ఇమ్రూల్ ఔటవడంతో క్రీజులోకి వచ్చిన ముష్ఫికర్ రహీమ్ కూడా దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తించారు. మూడో వికెట్‌కి హక్-రహీమ్ జోడి 236 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పంది. సెంచరీకి చేరువైన రహీమ్ బంతిని హిట్ చేసే ప్రయత్నంలో ఔటవగా.. లిటన్ దాస్ (0) గోల్డన్ డక్‌గా ఔటయ్యాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మహ్మదుల్లా (9 బ్యాటింగ్)తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. శ్రీలంక బౌలర్లలో లక్మల్ రెండు వికెట్లు పడగొట్టగా.. పెరీరా, సండకన్ చెరో వికెట్ తీశారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.