For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డబుల్ సెంచరీతో అరుదైన రికార్డు: లారా సరసన నిలిచిన హోల్డర్

1st Test: Jason Holders Double Century Puts Windies In Total Control vs England

హైదరాబాద్: బార్బడోస్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్‌ టెస్టు కెప్టెన్‌ జాసన్‌ హోల్డర్‌ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో వెస్టిండిస్ రెండో ఇన్నింగ్స్‌లో జాసన్ హోల్డర్‌(202 నాటౌట్‌; 229 బంతుల్లో 23 ఫోర్లు, 8 సిక్సర్లు) అజేయంగా డబుల్ సెంచరీ నమోదు చేశాడు.

టెస్టుల్లో జాసన్‌కు ఇది తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం. అతనికి తోడు షేన్‌ డొవ్రిచ్‌(116 నాటౌట్‌; 224 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్‌) సెంచరీతో రాణించడంతో వెస్టిండీస్‌ తన రెండో ఇన్నింగ్స్‌ను 415/6 వద్ద డిక్లేర్‌ చేసింది. ఈ క్రమంలోనే హోల్డర్‌ అరుదైన రికార్డును నెలకొల్పాడు.

టెస్టుల్లో ఇంగ్లాండ్ సాధించిన స్కోరు కంటే అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో విండీస్‌ కెప్టెన్‌గా హోల్డర్‌ నిలిచాడు. గతంలో బ్రియాన్‌ లారా(400 నాటౌట్‌) క్వాడ్రాపుల్‌ సెంచరీ సాధించగా, ఇంగ్లాండ్‌ జట్టు 285 పరుగులకు ఆలౌటైంది. 2004లో సెయింట్‌జోన్స్‌లో జరిగిన టెస్టులో లారా ఈ ఘనతను సాధించాడు.

ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఆ ఘనత సాధించిన విండీస్‌ కెప్టెన్‌గా హోల్డర్‌ నిలిచాడు. కాగా, రెండో ఇన్నింగ్స్‌లో విండిస్ జట్టు 120 పరుగుల వద్ద ఆరో వికెట్‌ కోల్పోయినా... హోల్డర్‌-డొవ్రిచ్‌ల జోడి భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేయడం విశేషం. విండిస్ తరుపున ఏడో వికెట్‌కు ఇది మూడో అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం.

మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో 77 పరుగులకే ఆలౌటైన ఇంగ్లాండ్... మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తన రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ 572 పరుగులు వెనుకబడి ఉంది. వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 289 పరుగులు చేసింది.

Story first published: Saturday, January 26, 2019, 16:14 [IST]
Other articles published on Jan 26, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+