Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తొలి టెస్టు: ఆసీస్ ఆటగాళ్లతో మంచి ప్రెండ్ షిప్ ఉందన్న కోహ్లీ

హైదరాబాద్: ఆస్ట్రేలియా జట్టులోని ఆటగాళ్లతో తనకు మంచి ప్రెండ్ షిప్ ఉందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి మ్యాచ్ గురువారం (ఫిబ్రవరి 23)న పూణెలో ప్రారంభం కానుంది.

తొలి టెస్టు నేపథ్యంలో పూణెలో బుధవారం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. 'ఆసీస్ జట్టులోని కొందరు ఆటగాళ్లు నాకు మంచి స్నేహితులు. మైదానం బయట చాలా మందితో ప్రెండ్ షిప్ ఉంది. అయితే ఈ ప్రెండ్ షిప్ లైన్ ఎంత మేరకు గీయాలో బాగా తెలుసు' అని విరాట్ కోహ్లీ చెప్పాడు.

విదేశీ ఆటగాళ్లతో మంచి సంబంధాలు

విదేశీ ఆటగాళ్లతో మంచి సంబంధాలు

టీ20 టోర్నీ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చిన తర్వాత వివిధ దేశాలకు చెందిన పలువురు ఆటగాళ్లు వివిధ ప్రాంచైజీలకు ఆడుతండటంతో ఒకరితో మరొకరు మంచి సంబంధాలను కలిగి ఉంటున్న సంగతి తెలిసిందే.

ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే.

కోహ్లీ నేతృత్వంలో ఆడిన మిచెల్ స్టార్క్

కోహ్లీ నేతృత్వంలో ఆడిన మిచెల్ స్టార్క్

2015 ఐపీఎల్ సీజన్‌లో ఆస్ట్రేలియాకు చెందిన పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ కోహ్లీ నేతృత్వంలో ఆడాడు. ప్రస్తుతం మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియా టెస్టు జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. స్టేడియం బయట ప్రెండ్ షిప్ ఉంటుంది కానీ ఆట విషయంలో మాత్రం సొంత తమ్ముడితో నైనా రాజీ పడే ప్రసక్తే లేదని కోహ్లీ స్పష్టం చేశాడు.

దృష్టంతా ఆసీస్ సిరిస్‌పైనే

దృష్టంతా ఆసీస్ సిరిస్‌పైనే

ప్రస్తుతం తమ దృష్టి అంతా ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్టు సిరిస్‌పైనే ఉందని విరాట్ కోహ్లీ చెప్పాడు. మరోవైపు ఈ మధ్య కాలంలో తన కెప్టెన్సీపై కురుస్తున్న ప్రశంసల జల్లు కూడా కోహ్లీ స్పందించాడు. తన కెప్టెన్సీపై ఇప్పటికిప్పుడే తీర్పు ఇవ్వడం చాలా తొందరపాటు అవుతుందని కోహ్లీ పేర్కొన్నాడు.

బ్యాట్స్‌మన్‌గా చాలా మెరుగయ్యా

బ్యాట్స్‌మన్‌గా చాలా మెరుగయ్యా

ఒక బ్యాట్స్‌మన్‌గా తాను చాలా మెరుగయ్యాయని, కెప్టెన్సీ వల్ల తన బ్యాటింగ్‌కు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదని చెప్పాడు. జట్టుగా టీమిండియా ప్రస్తుతం అత్యుత్తమంగా రాణించడంపై కోహ్లీ హర్షం వ్యక్తం చేశాడు. మంచి జట్టు ఉండటం వల్లే తాను సారథిగా రాణిస్తున్నానని, కాబట్టి తన సారథ్యంపై జడ్జిమెంట్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని కోహ్లీ పేర్కొన్నాడు.

విజయమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటా

విజయమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటా

'ప్రతి సిరీస్‌ తర్వాత నన్ను నేను జడ్జ్‌ చేసుకోను. ప్రతి మ్యాచ్‌లోనూ విజయమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటాను' అని కోహ్లి చెప్పాడు. జట్టు బాగా ఆడినప్పుడు కెప్టెన్సీ కూడా బాగుంటుందని కోహ్లీ అన్నాడు. 'ఐదు నుంచి ఎనిమిదేళ్ల పాటు నేను కెప్టెన్‌గా కొనసాగితే అప్పుడు నా కెప్టెన్సీపై బేరిజు వేసుకుంటాను' అని కోహ్లీ చెప్పాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+