Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

110 ఏళ్ల రికార్డుని బద్దలు కొట్టిన ఇంగ్లాండ్ ఓపెనర్

రాజ్‌కోట్: ఇంగ్లాండ్ ఓపెనర్ హసీబ్ హమీద్ సరికొత్త రికార్డుని నమోదు చేశాడు. రాజ్ కోట్ టెస్టు ద్వారా అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన హసీబ్ హమీద్ తొలి టెస్టులో ఐదో రోజైన ఆదివారం నాడు 110 ఏళ్ల రికార్డుని అధిగమించాడు.

114/0 ఓవర్ నైట్ స్కోరుతో ఆటను కొనసాగించిన ఇంగ్లాండ్ ఓపెనర్లు అలెస్టర్ కుక్-హసీబ్ హమీద్‌లు జట్టుకు 180 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందించి ఓ సరికొత్త రికార్డును నమోదు చేశారు. ఇదే భారత్‌లో ఇంగ్లాండ్ సాధించిన అత్యుత్తమ టెస్టు ఓపెనింగ్ భాగస్వామ్యం.

1st Test: England's Haseeb Hameed breaks 110-year record against India

19 ఏళ్ల ఇంగ్లాండ్ ఓపెనర్ హసీబ్ హమీద్ రెండో ఇన్నింగ్స్‌లో 177 బంతులను ఎదుర్కొని ఒక సిక్స్, ఏడు బౌండరీలతో 82 పరుగులు చేసి అమిత్ మిశ్రా బౌలింగ్‌లో అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వీరిద్దరి జోడీ తొలి వికెట్‌కు 180 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.

కాగా, 1906లో కేప్ టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ఇంగ్లాండ్ అటగాడు జాక్ క్రాఫర్డ్ చేసిన 74 పరుగుల రికార్డుని కూడా హసీబ్ హమీద్ రాజ్ కోట్ టెస్టులో అధిగమించి చరిత్ర సృష్టించాడు. ఇదే విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధికారికంగా తన ట్విట్టర్‌లో పేర్కొంది.

ఇదిలా ఉంటే తొలి టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ తన కెరీర్‌లో 30వ సెంచరీని సాదించాడు. 194 బంతుల్లో 10 ఫోర్లు సాయంతో కుక్ సెంచరీని సాధించాడు. రాజ్ కోట్ టెస్టులో హమీద్-కుక్‌ల జోడీ తొలి వికెట్‌కు 180 పరుగుల భాగస్వామ్యం సాధించింది. ఇది కూడా ఇంగ్లాండ్ జట్టుకు సరికొత్త రికార్డు.

ఇప్పటి వరకు అత్యధిక ఇంగ్లాండ్ టెస్టు ఓపెనింగ్ భాగస్వామ్యం గ్రేమ్ ఫావ్లర్-రాబిన్స్‌ల పేరిట ఉంది. 1985లో చెన్నైలో వీరిద్దరి జోడి నమోదు చేసిన 178 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యమే ఈరోజు వరకూ భారత్‌లో ఇంగ్లాండ్ అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం.

మరోవైపు మొత్తంగా చూస్తే భారత్‌లో ఇది రెండో అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం. గతంలో టీమిండియా ఓపెనర్లు గౌతం గంభీర్-వీరేంద్ర సెహ్వాగ్‌లు స్వదేశంలో సాధించిన 182 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం మొట్టమొదటి స్ధానంలో ఉంది. ఈ రికార్డుని కేవలం రెండు పరుగుల తేడాతో కుక్-హమీద్ జోడీ కోల్పోయింది.

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన తొలి క్రికెట్ టెస్టు డ్రాగా ముగిసింది. రాజ్ కోట్ టెస్టులో ఎక్కువ భాగం ఆధిపత్యం చెలాయించిన ఇంగ్లాండ్... భారత్ జట్టులో ఆడనున్న సుదీర్ఘ సిరీస్‌కు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది.

310 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆదివారం ఐదో రోజు బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 52.3 ఓవర్లలో 6 వికెట్లకు 172 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+