For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

1st Test: ఇంగ్లాండ్‌పై రికార్డు విజయాన్ని నమోదు చేసిన వెస్టిండిస్

1st Test: Eight-Wicket Roston Chase Stars As Windies Humiliate England By 381 Runs

హైదరాబాద్: కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య వెస్టిండిస్ జట్టు చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో ఆఫ్ స్పిన్నర్ రోస్టన్ ఛేజ్(8/60) అత్యుత్తమ గణాంకాలను నమోదు చేయడంతో వెస్టిండిస్ జట్టు 381 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ విజయం వెస్టిండిస్‌కు సొంతగడ్డపై పరుగుల పరంగా అతి పెద్ద విజయం కావడం విశేషం. అంతేకాదు గత 91 ఏళ్లుగా టెస్టు క్రికెట్ ఆడుతోన్న వెస్టిండిస్‌కు ఇది మూడో అతి పెద్ద విజయం. ఈ మ్యాచ్‌లో వెస్టిండిస్ నిర్దేశించిన 628 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 246 పరుగులకే ఆలౌటైంది.

నాలుగు రోజైన శనివారం ఆటలో మొత్తం 10 వికెట్లను కోల్పోయిన ఇంగ్లాండ్‌ ఘోరంగా ఓడిపోయింది. విండీస్‌ ఆఫ్‌ స్పిన్నర్ రోస్టన్‌ చేజ్‌ ఈ టెస్టులో తన కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఛేజ్ 60 పరుగులిచ్చి ఎనిమిది వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ పతనాన్ని శాసించాడు.

వెస్టిండీస్‌ కెప్టెన్‌ జాసన్‌ హోల్డర్‌ డబుల్‌ సెంచరీకి తోడు షేన్‌ డొవ్రిచ్‌(116 నాటౌట్‌; 224 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్‌) సెంచరీతో రాణించడంతో విండీస్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన విండిస్ కెప్టెన్ జాసన్ హోల్డర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

స్కోరు వివరాలు:
వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 289 ఆలౌట్‌,
రెండో ఇన్నింగ్స్‌ 415/6 డిక్లేర్డ్‌

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 77 ఆలౌట్‌,
రెండో ఇన్నింగ్స్‌ 246 ఆలౌట్‌

Story first published: Sunday, January 27, 2019, 14:56 [IST]
Other articles published on Jan 27, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+