Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కుక్ సెంచరీల రికార్డు: కెరీర్‌లో 30, భారత్‌లో ఐదోది

రాజ్‌కోట్: రాజ్‌కోట్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ సరికొత్త రికార్డుని నమోదు చేశాడు. కెరీర్‌లో 136 టెస్టు ఆడుతున్న అలెస్టర్ కుక్ రాజ్‌కోట్‌లో భార‌త్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచ‌రీ న‌మోదు చేశాడు.



194 బంతుల్లో 10 ఫోర్లు సాయంతో కుకు సెంచరీని సాధించాడు. టెస్టుల్లో ఇది కుక్‌కు 30వ సెంచ‌రీ కావ‌డం విశేషం. అయితే ఈ సెంచరీ సాధించడం ద్వారా కుక్ అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. భారత్‌లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన విదేశీ ఆటగాడిగా గుర్తింపు సాధించాడు.

 Alastair Cook slams 30th Test ton, puts England in driver's seat

తాను చేసిన 30 సెంచరీల్లో టీమిండియాపై కుక్ 6 సెంచరీలు చేశాడు. అయితే కుక్‌కి ఇది భారత్ లో ఐదో టెస్టు సెంచరీ. ఇప్పటివరకు ఏ విదేశీ ఆటగాడు భారత్‌లో నాలుగు సెంచరీలు మించి చేయలేదు. దీంతో కుక్ తన క్రికెట్ కెరీర్‌లో మరో ఘనతను సాధించినట్లైంది.

ఫోటోలు: Cricket - England Tour Of India 2016-17

అంతకముందు వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్లైవ్ లాయిడ్, దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లాలు మాత్రమే భారత్‌లో నాలుగు సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. ఇదిలా ఉండగా, 114/0 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లాండ్ జట్టు 260/3 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లర్డ్ చేసింది.

ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఓపెనర్లు అలెస్టర్ కుక్-హమీద్‌లు అత్యంత నిలకడగా ఆడారు. అయితే ఈ జోడీ 180 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం సాధించిన తరువాత హమీద్(82) వెనుదిరిగాడు. అమిత్ మిశ్రా బౌలింగ్‌లో అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి హమీద్ అవుటయ్యాడు. ఆ తరువాత కొద్దిసేపటికే జో రూట్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు.

దీంతో ఇంగ్లాండ్ ఐదో రోజు 3 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. భారత్ ముందు 310 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కెప్టెన్ కుక్ 130 పరుగులు చేయగా, మరో ఓపెనర్ హమీద్ 82, రూట్ 4, స్టోక్స్ 29 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మిశ్రా 2, అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నారు.

ఆదివారం ఇంకా 49 ఓవర్ల ఆట మాత్రమే ఉన్నందున టీమిండియా టెస్టును డ్రా చేసేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. కాగా, భార‌త్ త‌న తొలి ఇన్నింగ్స్‌లో 488 పరుగులకు ఆలౌటైంది. ఆదివారం ఆఖ‌రి రోజు కావ‌డంతో టెస్టును డ్రా చేసే అవకాశాలు లేకపోలేదు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+