రాజ్‌కోట్: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. 63/0 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే భారత్ ఇంకా 218 పరుగులు చేయాల్సి ఉంది.
భారత బ్యాట్స్‌మెన్లలో పుజారా (124), విజయ్‌లు (126) అద్భుతమైన బ్యాటింగ్‌తో సెంచరీలు నమోదు చేశారు. అయితే 108వ ఓవర్ చివరి బంతికి విజయ్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. మూడోరోజు ముగుస్తుందనగా క్రీజులోకి వచ్చిన అమిత్ మిశ్రా 109వ ఓవర్ మూడో బంతికి డకౌట్ అయ్యాడు.
దీంతో 108.3 ఓవర్లకు గాను భారత్ 4 వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ 26 పరుగులతో ఉన్నాడు. శనివారం కూడా టీమిండియా బ్యాటింగ్‌ను కొనసాగించనుంది. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్, సువర్ట్ బ్రాడ్, అదిల్ రషీద్, జాఫర్ అన్సారీలు తలో వికెట్ పడగొట్టారు.
రాజ్‌కోట్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాట్స్ మెన్లు చెలరేగి ఆడుతున్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు సాధిస్తే... మూడో రోజు ఆటలో భాగంగా భారత ఆటగాళ్లు రెండు సెంచరీలను నమోదు చేశారు.

63/0 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత ఆటగాళ్లు మురళీ విజయ్, ఛటేశ్వర పుజారాలు సెంచరీలు సాధించారు. తొలుత పూజారా సెంచరీని నమోదు చేస్తే, ఆ తరువాత కాసేపటికి మురళీ విజయ్ సెంచరీ సాధించాడు.
పుజారా 169 బంతుల్లో 15 ఫోర్లతో సెంచరీ సాధించగా, మురళీ విజయ్ 256 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీని నమోదు చేశాడు. మూడో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా ఆరంభంలోనే గౌతం గంభీర్(29)ను తొలి వికెట్‌గా కోల్పోయింది. ఆ తర్వాత విజయ్‌తో పుజారా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.
సెంచరీ సాధించిన మురళీ విజయ్
తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్లు చెలరేగి ఆడుతున్నారు. 260 బంతులను ఎదుర్కొన్న ఓపెనర్ మురళీ విజయ్ 8 ఫోర్లు, 3 సిక్సులతో సెంచరీని సాధించాడు. టెస్టుల్లో మురళీ విజయ్‌కు ఇది 7వ సెంచరీ. అంతకముందు పుజారా సెంచరీని పూర్తి చేశాడు. ఆ వెంటనే మురళీ విజయ్ కూడా సెంచరీ సాధించాడు. వీరిద్దరూ రాణించడంతో భారత్ పటిష్టమైన స్థితిలో ఉంది. దీంతో 86 ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి టీమిండియా 258 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పుజారా 112, మురళీ విజయ్ 103 పరుగులతో ఉన్నారు.
సొంతగడ్డపై పుజారా సెంచరీ:
రాజ్ కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌లో జరుగుతున్న తొలి టెస్టులో ఛటేశ్వర పుజారా సెంచరీ నమోదు చేశాడు. మూడో రోజు శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ ఇంగ్లాండ్‌కు దీటుగా బదులిస్తోంది. పుజారా 169 బంతుల్లో 15 ఫోర్లతో సెంచరీని పూర్తి చేశాడు. టెస్టుల్లో పుజారాకు ఇది 9వ సెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం భారత్ 81 ఓవర్లలో 229 రన్స్ చేసింది. ప్రస్తుతం పుజారా 100, విజయ్ 86 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు అజేయంగా 161 పరుగులు జోడించారు.
రాజ్‌కోట్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. డ్రింక్స్ విరామ సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 195 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఛటేశ్వర పుజారా 83, మురళీ విజయ్ 69 పరుగులతో ఉన్నారు.
అంతక ముందు లంచ్ విరామ సమయానికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి 162 పరుగులు చేసింది. భారత ఆటగాళ్లు మురళీ విజయ్, ఛటేశ్వర పుజారాలు అర్ధసెంచరీలతో రాణించారు. 63/0 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.

ఫోటోలు: Cricket - England Tour Of India 2016-17
జట్టు స్కోరు 68 పరుగుల వద్ద ఓపెనర్ గౌతం గంభీర్(29) తొలి వికెట్ గా వెనుదిరిగాడు. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన గంభీర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేరాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన పూజారా... మురళీ విజయ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.
ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ భారత స్కోరు బోర్డుని పరిగెత్తిస్తున్నాడు. మరో ఓపెనర్ విజయ్ నిలకడగా ఆడుతూ పూజారాతో కలిసి చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పుతున్నాడు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 50 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 162 పరుగులు చేసింది.

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌ను టీమిండియా చేరుకోవాలంటే ఇంకా 375 పరుగులు చేయాల్సి ఉంది. టాస్ గెలిచి తొలి ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లాండ్ 537 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు జో రూట్(124), మొయిన్ అలీ(117), బెన్ స్టోక్స్(128) సెంచరీలతో రాణించారు.