Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అశ్విన్ ఒక్కడే బాధ్యుడా?: విమర్శలపై జడేజా మద్దతు

రాజ్‌కోట్: రాజ్‌కోట్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌ను నిందించడంపై మరో ఆటగాడు రవీంద్ర జడేజా అతనికి మద్దతుగా నిలిచాడు. రాజ్ కోట్ టెస్టులో ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 537 పరుగులు చేసి ఆలౌటైంది.

ఈ సందర్భంగా ఇంగ్లాండ్ జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేయడంతో టీమిండియా బౌలర్లు విఫలమయ్యారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 46 ఓవర్లు వేసి 167 పరుగులు ఇచ్చాడు. దీంతో క్రికెట్ విశ్లేషకులు అశ్విన్ బౌలింగ్‌పై విమర్శలు గుప్పించడాన్ని జడేజా తప్పుపట్టాడు.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు జో రూట్(124), మొయిన్ అలీ(117), బెన్ స్టోక్స్(128) సెంచరీలతో రాణించడంతో ఇంగ్లాండ్ 537 పరుగులకే ఆలౌట్ అయింది.

1st Test, Day 2: Ashwin alone can't get all the wickets, says Jadeja

రెండో రోజు ఆట ముగిసిన తర్వాత రవీంద్ర జడేజా మీడియాతో మాట్లాడాడు. అశ్విన్‌కు బౌలర్ల పూర్తి సహకారం ఉంటుందని తెలిపాడు. వికెట్లు తీయడం అనేది బౌలర్లు అందరి బాధ్యత అని, అంతే కానీ అశ్విన్ రాణించకపోవడంతో ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధించిందన్న వ్యాఖ్యలను జడేజా తప్పుబట్టాడు.

'జట్టులో మొత్తం ఐదుగురు బౌలర్లం ఉన్నాం. వికెట్లు తీసే బాధ్యత అందరికీ ఉంది. కేవలం ఒక్కర అశ్విన్‌కు మాత్రమే కాదు. కొన్ని సార్లు పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. అది ఆటలో ఓ భాగం మాత్రమే. ప్రతీ ఒక్కరికీ సమానంగా ఇందులో భాగస్వామ్యం ఉంటుంది' అని అన్నాడు.

'తొలుత టాస్ ఓడిపోవడం కూడా మిశ్రమ ఫలితాలకు దారితీసింది. ఆటలో భాగంగా కొన్నిసార్లు కొందరిపై తీవ్ర విమర్శలు రావడం సాధారణమేనని, అయితే జట్టులోని ప్రతి ఒక్కరూ సమిష్టిగా రాణిస్తేనే విజయాలు సాధ్యం అవుతాయి' అని రవీంద్ర జడేజా అభిప్రాయపడ్డాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+