రాజ్‌కోట్: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ పూర్తిగా తన ఆధిపత్యాన్ని చాటింది. భారత్ జట్టులో ఆడనున్న సుదీర్ఘ సిరీస్‌కు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని తొలి టెస్టు ద్వారా కూడగట్టుకుంది.
భారత్ Vs ఇంగ్లాండ్ తొలి టెస్టు స్కోరుకార్డు
తొలి టెస్టులో విజయానికి చేరువగా వచ్చి డ్రాగా ముగియడంతో ఇంగ్లాండ్ కెప్టెన్ కాస్తంత నిరాశ చెందాడు. 114/0 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం చివరి రోజున రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ తన రెండో ఇన్నింగ్స్ ను 260/3 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే లంచ్ విరామ సమయానికి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడాన్ని కెప్టెన్ అలెస్టర్ కుక్ సమర్ధించుకున్నారు. మ్యాచ్ అనంతరం కుక్ మీడియాతో మాట్లాడాడు. తొలి టెస్టు ఐదు రోజులు అద్భుతమైన రోజులు. బంగ్లాదేశ్‌తో పోలిస్తే చాలా కఠిమైన టెస్టు మ్యాచ్‌గా అభివర్ణించాడు.
ఫోటోలు: Cricket - England Tour Of India 2016-17
తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు బాగా ఆడింది. ముఖ్యంగా మా జట్టులో నలుగురు బ్యాట్స్‌మెన్లు సెంచరీలు సాధించారు. స్పిన్నర్లు అద్భుతమైన బౌలింగ్ చేశారని కొనియాడారు. ఫలితాన్ని రాబట్టే స్థితిలో మేం ఉన్నప్పటికీ, చివరి నిమిషంలో టెస్టు చేజారడం నిరాశకు గురి చేసిందని చెప్పుకొచ్చాడు.

తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు ఆడిన ఆటతీరుకు గర్వపడుతున్నామని చెప్పాడు. ఇక డిక్లేర్ చేయడం ఆలస్యం అయిందంటూ వచ్చిన వార్తలపై కూడా కుక్ స్పందించాడు. భారత్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదన్నదే తమ ఉద్దేశమని కుక్ అభిప్రాయపడ్డాడు.
నిలబడటం కోసమే బ్యాటింగ్ చేయడానికి, 260 లేదా 270 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి చాలా వ్యత్యాసం ఉందని తెలిపాడు. అదే పిచ్‌పై 180/0 పరుగులతో ఉన్నామని చెప్పిన కుక్, పిచ్ బంతికి ఏ మాత్రం సహకరించడం లేదని చెప్పుకొచ్చాడు. దీంతో సరైన సమయంలోనే ఇన్నింగ్స్ డిక్లేర్ చేశామని భావిస్తున్నానని తెలిపాడు.
ఇదిలా ఉంటే కెరీర్‌లో 136 టెస్టు ఆడుతున్న అలెస్టర్ కుక్ రాజ్‌కోట్‌లో భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ నమోదు చేశాడు. 194 బంతుల్లో 10 ఫోర్లు సాయంతో కుకు సెంచరీని సాధించాడు. టెస్టుల్లో ఇది కుక్‌కు 30వ సెంచరీ కావడం విశేషం.
అయితే ఈ సెంచరీ సాధించడం ద్వారా కుక్ అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. భారత్‌లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన విదేశీ ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. తాను చేసిన 30 సెంచరీల్లో టీమిండియాపై కుక్ 6 సెంచరీలు చేశాడు. అయితే కుక్‌కి ఇది భారత్ లో ఐదో టెస్టు సెంచరీ. ఇప్పటివరకు ఏ విదేశీ ఆటగాడు భారత్‌లో నాలుగు సెంచరీలు మించి చేయలేదు.