1st T20I: 2 పరుగులు, 2 వికెట్లు... బుమ్రా 19వ ఓవర్‌ని చూశారా? (వీడియో)

హైదరాబాద్: రెండు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం విశాఖపట్నం వేదికగా తొలి టీ20 జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పర్యాటక జట్టు చేతిలో టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైనప్పటికీ.. భారత బౌలర్లు మాత్రం అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా టీమిండియా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ బుమ్రా నాలుగు ఓవర్ల పాటు బౌలింగ్ వేసి మూడు వికెట్లు తీసి 16 పరుగులు సమర్పించుకున్నాడు.
19వ ఓవర్‌లో బుమ్రా తన బౌలింగ్‌తో
ముఖ్యంగా ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో బుమ్రా తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన బుమ్రా కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ ఓవర్ ఐదో బంతికి హ్యాండ్ స్కాంబ్‌ను ఔట్ చేసిన బుమ్రా.. ఆరో బంతికి కౌల్టర్ నైల్‌ను బౌల్డ్ చేశాడు. ముఖ్యంగా కౌల్టర్‌నైల్‌ను బౌల్డ్ చేసిన బంతి గురించి ఎంత చెప్పినా తక్కువే.

వికెట్ సైతం అమాంతం గాల్లోకి ఎగిరింది
బుమ్రా వేసిన ఇన్‌స్వింగ్ యార్కర్‌కు కౌల్టర్ నైల్ దగ్గర సమాధానమే లేదు. వికెట్ సైతం అమాంతం గాల్లోకి ఎగిరింది. ఆ బంతిని చూసిన అబిమానులు సైతం అవాక్కయ్యారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయానికి ఆఖరి ఓవర్‌లో 14 పరుగులు అవసరమయ్యాయి. ఆఖరి ఓవర్ వేసిన ఉమేశ్ బౌలింగ్‌లో ఆసీస్ విజయానికి కావాల్సిన పరుగులు రాబట్టడంలో భారత్‌కు ఓటమి తప్పలేదు.

ఆసీస్ విజయానికి చివరి ఓవర్‌లో 14 పరుగులు
ఆస్ట్రేలియా విజయానికి చివరి ఓవర్‌లో 14 పరుగులు కావాలి. తొలి బంతికి కమిన్స్ సింగిల్. రెండో బంతిని డీప్ స్క్వేర్‌లెగ్‌లో బౌండరీకి తరలించాడు రిచర్డ్‌సన్. ఆ తర్వాతి బంతికి 2 పరుగులు. నాలుగో బంతికి సింగిల్. చివరి రెండు బంతుల్లో ఆసీస్ విజయానికి ఆరు పరుగులు అవసరమయ్యాయి. ఆఫ్ స్టంప్ ఆవల ఉమేశ్ వేసిన ఫుల్‌టాస్ బంతిని కమిన్స్ కవర్స్‌లో బౌండరీకి తరలించాడు.

ఆఖరి బంతికి 2 పరుగులు
దీంతో ఆఖరి బంతికి 2 పరుగులు అవసరమయ్యాయి. వికెట్లను లక్ష్యంగా చేసుకుని వేసిన బంతిని కమిన్స్ స్ట్రెయిట్‌గా ఆడాడు. ఆ బంతికి రెండు పరుగులు పూర్తి చేయడంతో ఆస్టేలియా ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్లు తేడాతో విజయం సాధించింది. దీంతో ఆసీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య బుధవారం బెంగళూరు వేదికగా రెండో టీ20 జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications