ధర్మశాల: గాంధీ జయంతి రోజున సఫారీలతో తొలి T20(ఫోటోలు)
ధర్మశాల: సుదీర్ఘ పర్యటనలో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న తొలి ట్వంటీ20 మ్యాచ్‌కి హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల మైదానం సిద్ధమైంది. రెండు జట్లలో కూడా అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
ఢిల్లీ వేదికగా భారత్-ఏ జట్టుతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓడినప్పటికీ, ఆ జట్టును తక్కువగా అంచనా వేయలేమని టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. ధర్మశాల క్రికెట్‌కు చక్కని వేదికని, నేనైతే ప్రపంచంలోనే తొలి ఐదు స్టేడియాల్లో ఇది ఒకటి అని చెప్పాడు.

దక్షిణాఫ్రికాతో తొలి టీ20
భారత్ వెలుపల ఇలాంటి స్టేడియాన్ని నేను చూడలేదు అని రోహిత్ అన్నాడు. టీమ్ డైరెక్టర్ రవిశాస్ర్తి, సహాయక కోచ్‌ల పర్యవేక్షణలో బుధవారం భారత ఆటగాళ్లు రెండు గంటల పాటు నెట్ సెషన్‌లో పాల్గొన్నారు.

దక్షిణాఫ్రికాతో తొలి టీ20
టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం పూర్తిగా వన్డే, ట్వంటీ20లకే పరిమతమైన ధోని నాయకత్వంలో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టుకు స్టార్ బ్యాట్స్‌మెన్ డుప్లెసిస్ సారధ్యం వహించనున్నాడు.

దక్షిణాఫ్రికాతో తొలి టీ20
టీమిండియా చివరగా ఈ ఏడాది జులైలో జింబాబ్వే జట్టుతో రెండు ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడగా చెరో మ్యాచ్‌ను గెలుపొందాయి. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ క్యూరేటర్ ఎస్ చౌహాన్ మాట్లాడుతూ పిచ్‌కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

దక్షిణాఫ్రికాతో తొలి టీ20
ఫాస్ట్ వికెట్ పిచ్‌గా రూపొందించామని చెప్పిన ఆయన బ్యాట్స్‌మెన్‌తో పాటు స్ఫిన్నర్స్‌కు పిచ్ అనుకూలమన్నారు. 40 ఓవర్ల మ్యాచ్‌లో పిచ్ అనుకూలంగా ఉంటుందన్నారు. ధర్మశాల మైదానం బౌండరీ 75 యార్డులుగా ఉందన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications