పుణే: శ్రీలంకతో పుణేలో జరిగిన తొలి ట్వంటీ 20 మ్యాచ్‌లో భారత్ దారుణ పరాజయం మూటగట్టుకుంది. 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో పుణే పిచ్ పైన కెప్టెన్ ధోనీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గత నెల రోజులుగా తాము ఆడుతున్న దానికి ఈ పిచ్ పూర్తి వ్యతిరేకంగా ఉందని చెప్పాడు.
ఇటీవలి వరకు టీమిండియా ఆస్ట్రేలియాలో ఆడి వచ్చిన విషయం తెలిసిందే. ఇది ఇంగ్లీష్ వికెట్ కంటే దారుణంగా ఉందన్నాడు. వికెట్‌ను సరిగా చేయలేదన్నాడు. తాము భారీ షాట్లు కొట్టలేకపోయామని చెప్పాడు. ఈ వికెట్ పైన 135-140 పరుగులు చేయవచ్చునని చెప్పాడు.

అదే సమయంలో ఓటమి నుంచి సానుకూల పాఠాలు నేర్చుకుంటామన్నాడు. తమ షాట్ సెలక్షన్ కూడా బాగా లేదని, బ్యాటింగ్‌ను సమీక్షించుకుంటామన్నాడు. ఈ రోజు అందరికీ బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చిందన్నాడు. బ్యాట్సుమెన్ పైన ఒత్తిడి నిజమేనని, ఫలితం ఆశించినట్లు లేదన్నాడు. ఈ మ్యాచ్ ద్వారా సానుకూల అంశాలు నేర్చుకుంటామన్నాడు.
మరోవైపు, భారత్ ఓటమి నేపథ్యంలో ట్విట్టర్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విరాట్ కోహ్లీ లేకుంటే భారత్ బాగా ఆడదంటూ కొందరు ట్విట్టర్లో ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. కోహ్లీ ఉంటే భారత్ బలంగా ఉంటుంది, లేకుండే బలహీనమవుతుందంటూ.. కొన్ని పోస్టులు చేస్తున్నారు. ఇక్కడ కొన్ని ట్వీట్లు..