Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తొలి టీ20: శ్రీలంక చేతిలో భారత్ చిత్తు

పూణే: మూడు ట్వంటీ20 మ్యాచుల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగన తొలి మ్యాచులో శ్రీలంక చేతిలో భారత్ చిత్తుగా ఓడిపోయింది. భారత్ తన ముందు ఉంచిన 102 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి శ్రీలంక కేవలం 18 ఓవర్లలో ఛేదించింది. శ్రీలంక 18 ఓవర్లలో 105 పరుగులు చేసింది.భారత బౌలర్లలో నెహ్రా, అశ్విన్ రెండేసి వికెట్లు తీయగా, సురేష్ రైనాకు ఒక వికెట్ లభించింది.

భారత్ తన ముందు ఉంచిన 102 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక 4 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది. డిక్‌వెల్లా నాలుగు పరుగల వ్యక్తిగత స్కోరు వద్ద నెహ్రా బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆశిష్ నెహ్రూ రెండో వికెట్ పడగొట్టాడు. దీంతో శ్రీలంక 23 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.

1st T20I: Sri Lanka invite India to bat in Pune; Rahane replaces Kohli

గుణతిలక 9 పరుగులు చేసి వెనుదిరిగాడు. 62 పరుగుల వద్ద శ్రీలంక మూడో వికెట్ కోల్పోయింది. కాపుగెదర 25 పరుగులు చేసి అశ్విన్ బౌలింగులో అవుటయ్యాడు. 84 పరుగుల వద్ద లంక నాలుగో వికెట్ కోల్పోయింది. చండీమాల్ 35 పరుగులు చేసి సురేష్ రైనా బౌలింగులో అవుటయ్యాడు. 91 పరుగుల వద్ద శ్రీలంక ఐదో వికెట్ కోల్పోయింది. శనక 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ బౌలింగులో అవుటయ్యాడు.

శ్రీలంకపై తొలి ట్వంటీ20 మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 20 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. 18.5 ఓవర్లలో 101 పరుగులు చేసి చేతులెత్తేసింది. చివరి వికెట్‌గా బుమ్రాహ్ అవుటయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్ భారత బ్యాట్స్‌మెన్‌లో 31 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

ఆరంగేట్రంలోనే రజిత అదరగొట్టాడు. తొలి రెండు వికెట్లను వెంటవెంటనే పడగొట్టి భారత్ వెన్ను విరిచాడు. ఆతను మూడు వికెట్లు తీశాడు. శనకకు కూడా వికెట్లు దక్కాయి. చమీరా రెండు వికెట్లు తీయగా, సేనా నాయకే ఒక్క వికెట్ పడగొట్టాడు.

1st T20I: Sri Lanka invite India to bat in Pune; Rahane replaces Kohli

భారత్‌పై మంగళవారం తొలి ట్వంటీ20 మ్యాచులో ఆరంగేట్రంలోనే శ్రీలంక బౌలర్ రజిత అదరగొట్టాడు. రోహిత్ శర్మతో పాటు అజింక్యా రహనేను సున్నా పరుగులకే వెనక్కి పంపించాడు. కేవలం నాలుగు పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సున్నా పరుగులకే తొలి వికెట్‌గా రోహిత్ శర్మ అవుటయ్యాడు.

రజిత ధాటికి భారత బ్యాట్స్ మెన్ బెంబేలెత్తుతున్నట్లే ఉన్నారు. 32 పరుగుల స్కోరు వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. శిఖర్ ధావన్ కేవలం 9 పరుగులు చేసి రజిత బౌలింగులోనే వెనుదిరిగాడు.

శ్రీలంక బౌలర్ల ధాటికి భారత బ్యాట్స్ మెన్ బెంబేలెత్తిపోయారు. 72 పరుగులకే భారత్ ఎనిమిది వికెట్లు కోల్పోయింది. రవీంద్ర జడేజా కేవలం 6 పరుగులలు చేసి సేనానాయకే బౌలింగ్ లో ఎనిమిదో వికెట్ గా వెనుదిరిగాడు. టాప్ ఆర్డర్ శ్రీలంక బౌలర్ల ధాటికి కుప్పకూలింది.

1st T20I: Sri Lanka invite India to bat in Pune; Rahane replaces Kohli

సురేష్ రైనా (20), యువరాజ్ సింగ్ (10), ధోనీ (2), హార్దిక్ పాండ్యా (2) వరుసగా ఔటయ్యారు. వంద పరుగుల స్కోరు వద్ద భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. నెహ్రా ఆరు పరుగులు చేసి చమీరా బౌలింగ్‌లో అవుటయ్యాడు.

తొలి ట్వంటీ20 మ్యాచులో శ్రీలంక కెప్టెన్ దినేష్ చండీమాల్ మంగళవారం సాయంత్రం టాస్ గెలిచి భారత్‌పై ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తాను ఫోర్స్, సిక్స్‌ల కోసం నిరీక్షిస్తున్నట్లు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అన్నారు. ప్రేక్షకులు హెల్మెట్ల ధరించాలని, అంత ధాటిగా బ్యాట్స్‌మెన్ బంతులను కోట్టాలని ఆయన అన్నారు.

1st T20I: Sri Lanka invite India to bat in Pune; Rahane replaces Kohli

ఆస్ట్రేలియాపై భారత్ 3-0 స్కోరుతో సిరీస్‌ను గెలిచిన తర్వాత శ్రీలంకపై స్వదేశంలో భారత్ ఆడుతోంది. ఈ సిరీస్‌కు విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చారు. అతని స్థానంలో అజింక్యా రహనే జట్టులోకి ఆడుతాడు. పవన్ నేగీ మైదానంలోకి దిగడానికి మరి కొంత కాలం ఆగాల్సి వస్తోంది.

ఆస్ట్రేలియా లసిత్ మలింగ, అంజిలో మాథ్యూస్, నువాన్ కులశేఖర, రంగన హెరాత్, తిలకరత్నే దిల్షాన్ లేకుండా బరిలోకి దిగుతోంది. శ్రీలంకపై భారత్ మూడు ట్వంటీ20 మ్యాచుల సిరీస్ ఆడనుంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+