ఈడెన్‌లో తొలి టీ20: కోహ్లీ, ధోని లేకుండా బరిలోకి టీమిండియా?

హైదరాబాద్: నెలరోజుల సుదీర్ఘ పర్యటన కోసం వెస్టిండిస్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. రెండు టెస్టు మ్యాచ్‌లను 0-2తో... ఐదు వన్డేల సిరిస్‌ను 1-3తో చేజార్చుకుంది. వన్డే సిరిస్ ముగియడంతో ఇప్పుడు ఆదివారం నుంచి జరిగే మూడు టీ20ల సిరిస్‌పై పడింది. అయితే, టీ20 సిరిస్‌లో వెస్టిండిస్ జట్టుని ఓడించడం అంత సులభం కాదు.
గత రెండేళ్లుగా వన్డే, టెస్టుల్లో విఫలమవుతున్న ఆ జట్టు టీ20ల్లో మాత్రం తిరుగులేని ప్రదర్శన కనబరుస్తోంది. మూడు టీ20ల సిరిస్ కోసం కార్లోస్ బ్రాత్‌వైట్, డారెన్ బ్రావో, కీరన్ పొలార్డ్, ఆండ్రీ రసెల్ లాంటి హిట్టర్లు టీ20 జట్టులోకి రావడంతో ఆ జట్టు బలంగా కనిపిస్తోంది. మరోవైపు కెప్టెన్ కోహ్లీ, ధోని లేని భారత జట్టుకు ఈ సిరిస్ సవాల్‌గా నిలవనుంది.

ఈడెన్ వేదికగా ఆదివారం తొలి టీ20
మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్ వేదికగా ఆదివారం రాత్రి తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన భారత సెలక్టర్లు అతని స్థానంలో కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఎంపిక చేశారు. మరోవైపు ధోనిపై వేటు వేసి వికెట్ కీపర్‌గా పంత్‌కు ఓ ఛాన్స్ ఇచ్చారు.

కోహ్లీ, ధోని లేని జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుందో?
దీంతో టీ20 సిరిస్‌లో ఇద్దరు అగ్రశ్రేణి ఆటగాళ్లు సిరీస్‌కి దూరమవ భారత్ జట్టు సిరీస్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో అని ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సిరిస్ కోసం ఎంపిక చేసిన భారత్ జట్టులో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు వస్తే.. మిడిలార్డర్‌లో కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్ బరిలోకి దిగనున్నారు.

కృనాల్ పాండ్యాకు అవకాశం దక్కేనా?
ఇక, ఆల్ రౌండర్ల జాబితాలో కృనాల్ పాండ్యా, స్పిన్నర్లుగా కుల్దీప్, చాహల్ ఇద్దరూ లేదా ఎవరో ఒకరు బరిలోకి దిగొచ్చు. ఒకవేళ కృనాల్ పాండ్యాకి అవకాశం లభించకపోతే, వాషింగ్టన్ సుందర్ తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఇక, ముగ్గురు పేసర్లతో టీమిండియా బరిలోకి దిగితే మాత్రం భువీ, బుమ్రాతో పాటు ఖలీల్ తుది జట్టులోకి ఎంపికయ్యే ఛాన్స్ ఉంది.

పిచ్ పరిస్థితులు, వాతావరణం:
కోల్‌కతాలో వాతావరణం పొడిగా ఉంది. బ్యాటింగ్ పిచ్ కావడంతో పరుగుల వరద పారే అవకాశం ఉంది. బౌలర్లకు కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

భారత్ జట్టు:
భారత్ జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్, దినేశ్ కార్తీక్, మనీశ్ పాండే, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, ఉమేశ్ యాదవ్, నదీమ్
వెస్టిండిస్ జట్టు:
కార్లోస్ బ్రాత్ వైట్(కెప్టెన్), ఫాబియన్ అలెన్, డారెన్ బ్రేవో, షింరోన్ హెట్మీర్, కీమో పాల్, కీరన్ పొలార్డ్, దీనేష్ రామ్ దిన్, ఆండ్రూ రస్సెల్, ఓషనే థామస్, ఖరీ పియర్, ఓబేడ్ మెక్కోయ్, రోవ్‌మన్ పావెల్, నికోలస్ పూరన్
మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications