సఫారీ పర్యటనలో భారత మహిళల జట్టు మరోసారి విజేత

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ను 2-1తో గెలుచుకున్న భారత అమ్మాయిల జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ ఓడించి సత్తా చాటారు. ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ కౌర్ వ్యవహరించింది. మిథాలీరాజ్ 48 బంతుల్లో 54 పరుగులను చేసి నాటౌట్‌గా నిలిచింది.
కెప్టెన్ వాన్ నికెర్క్ (38), డుప్రీజ్ (31) రాణించారు. భారత బౌలర్లలో అనుజ పాటిల్ రెండు వికెట్లు తీయగా..పూజ, శిఖ చెరో వికెట్ పడగొట్టారు. ఛేదనలో మిథాలీరాజ్, స్మృతి మంధాన (28) భారత్‌కు శుభారంభం అందించారు. ఈ జోడీ తొలి వికెట్‌కు వేగంగా 47 పరుగులు జత చేసింది. ఉన్నంతసేపు మెరిపించిన మంథాన రెండు భారీ సిక్స్‌లు బాదింది. మంధాన ఔటైన వెంటనే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (0) ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగింది.
ఈ స్థితిలో మిథాలీ, కెరీర్‌లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న 17 ఏళ్ల జెమిమా తోడుగా ఇన్నింగ్స్ నడిపించింది. ధాటిగా ఆడిన జెమిమా కీలక సమయంలో ఔట్ కావడంతో భారత్ ఒత్తిడిలో పడింది. 6 ఓవర్లలో 48 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ స్థితిలో వేద మెరుపు షాట్లతో ఛేదనను తేలిక చేసింది. 15వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు, సిక్సు బాదిన ఆమె.. ఆ తర్వాత మరో సిక్స్, ఫోర్ కొట్టడంతో లక్ష్యం (18 బంతుల్లో 17) సులభం అయిపోయింది. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో భారత్ 5 పరుగులు చేయాల్సి ఉండగా.. మరో భారీ సిక్స్‌తో వేద భారత్‌కు విజయాన్ని అందించింది.
బ్యాట్స్‌వుమెన్స్ వేద కృష్ణమూర్తి (37) నాటౌట్, జెమిమా రోడ్రిగ్స్ (37)మెరుపులు తోడవడంతో తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. మంగళవారం మొదట బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 164 పరుగులు సాధించింది.
భారత తరపున బ్యాటింగ్ కు దిగిన ఓపెనర్లు 8 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయారు. క్రీజులో మిథాలీ రాజ్ (21), రోడ్రిగోజ్ (20) ఉన్నారు. ఓవరాల్ స్కోరు 79/2
భారత మహిళల జట్టు సఫారీ జట్టుతో తలపడి 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. అదే ఉత్సాహంతో టీ 20 సిరీస్‌ను గెలుచుకోవాలని ఆరాటపడుతోంది.
టీ 20 మ్యాచ్‌కు భారత మహిళల జట్టులో మార్పులు చోటు చేసుకున్నాయి. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ వ్యవహరిస్తోంది. ఫిబ్రవరి 13న దక్షిణాఫ్రికాలోని పోచెఫ్‌రూమ్ ప్రాంతంలోని సెన్వెస్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది.
ఈ మ్యాచ్‌కు భారత జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంతకుముందు టీ 20లో సఫారీ జట్టుపై తలపడిన భారత జట్టు స్వల్ప వ్యత్యాసమైన 16 పరుగుల తేడాతో గెలిచింది. ఆ మ్యాచ్ నవంబరు 2014న బెంగుళూరు వేదికగా జరిగింది.
టీ 20లో ఆడనున్న ఇరు జట్లు:
India Women: Harmanpreet Kaur (C), Smriti Mandhana, Mithali Raj, Veda Krishnamurthy, Jemimah Rodrigues, Deepti Sharma, Anuja Patil, Taniya Bhatia, Nuzhat Parween, Poonam Yadav, Rajeshwari Gayakwad, Shikha Pandey, Pooja Vastrakar, Radha Yadav.
South Africa Women: Dane van Niekerk (C), Marizanne Kapp, Trisha Chetty, Shabnim Ismail, Ayabonga Khaka, Masabata Klaas, Sune Luus, Odine Kirsten, Mignon du Preez, Lizelle Lee, Chloe Tryon, Nadine de Klerk, Raisibe Ntozakhe, Moseline Daniels.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications