For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ ఓపెనర్‌గా రావడం వల్లే భారత్ ఓటమి పాలైందా?

కాన్పూర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో ఓపెనింగ్ స్ధానంలో బ్యాటింగ్ చేయడాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సమర్ధించుకున్నాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: కాన్పూర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో ఓపెనింగ్ స్ధానంలో బ్యాటింగ్ చేయడాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సమర్ధించుకున్నాడు. కోహ్లీ ఓపెనింగ్ స్ధానంలో బ్యాటింగ్ రావడం వల్లే తొలి టీ20లో భారత్ ఓటమి పాలైందన్న వార్తలను తోసిపుచ్చాడు.

'టీ20 టోర్నీ అయిన ఐపీఎల్‌లో ఓపెనింగ్‌ చేశా. కాబట్టి ఆ స్థానంలో ఎలా ఆడాలనే విషయంలో అవగాహన ఉంది. అందుకే ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగా. ఏదో ప్రత్యేకంగా కనపడాలని నేను ఇన్నింగ్స్‌ ఆరంభించలేదు. నేను ఓపెనింగ్‌ చేయడం వల్ల జట్టుకు సమతూకం వస్తుంది' అని తొలి వన్డే ఓటమి అనంతరం కోహ్లీ చెప్పాడు.

మూడో స్థానంలో రైనా ప్రమాదకర బ్యాట్స్‌మెన్

మూడో స్థానంలో రైనా ప్రమాదకర బ్యాట్స్‌మెన్

'మిడిల్‌ ఆర్డర్‌లో అదనపు బ్యాట్స్‌మన్‌ను తీసుకునే అవకాశం లేదు. రైనా లాంటి ఆటగాడు మూడో స్థానంలో మరింత ప్రమాదకర బ్యాట్స్‌మన్‌ అవుతాడు. కాబట్టి ఓపెనర్‌ రోహిత్‌ లేకపోతే నేను ఏ సమయంలోనైనా బాధ్యతలు తీసుకుంటా. జట్టుకు సమతూకం తేవాలన్నదే నా ఉద్దేశం' అని కోహ్లీ తెలిపాడు.

ఓపెనర్‌గా దిగాలన్న కోరిక నాకేమీ లేదు

ఓపెనర్‌గా దిగాలన్న కోరిక నాకేమీ లేదు

అంతేతప్ప తనకు ఓపెనర్‌గా దిగాలన్న కోరిక నాకేమీ లేదని కోహ్లీ పేర్కొనడం విశేషం. రెండో వన్డేలో కూడా ఓపెనింగ్ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు గాను పరిస్థితిని బట్టి ఆలోచిస్తానని చెప్పాడు. జట్టులో రోహిత్ ఉంటే కచ్చితంగా కేఎల్ రాహుల్‌తో అతడే ఓపెనింగ్ వస్తాడని చెప్పాడు.

రోహిత్ శర్మ ఉంటే అతడే మా ఛాయిస్

రోహిత్ శర్మ ఉంటే అతడే మా ఛాయిస్

అయితే గాయం కారణంగా ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డే, టీ20 సిరిస్‌కు రోహిత్ శర్మ దూరమైన సంగతి తెలిసిందే. తొలి టీ20లో ఓపెనర్ కేఎల్ రాహుల్ విఫలమైన నేపథ్యంలో ఓపెనర్లు నిలకడగా రాణిస్తే భారీ స్కోర్లు చేసేందుకు అవకాశం ఉంటుందని కోహ్లీ పేర్కొన్నాడు.

7 వికెట్ల తేడాతో ఓటమిపాలైన భారత్

7 వికెట్ల తేడాతో ఓటమిపాలైన భారత్

కాన్పూర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో కోహ్లీ సేన 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లకు 147 పరుగులు చేసింది. 148 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 18.1 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది.

మూడు వన్డేల సిరిస్‌ను 1-0తో ఇంగ్లాండ్ ఆధిక్యం

మూడు వన్డేల సిరిస్‌ను 1-0తో ఇంగ్లాండ్ ఆధిక్యం

ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 51 పరుగులు చేయగా, జోరూట్ 46, బిల్లింగ్స్ 22, జాసన్ రాయ్ 19 పరుగులు చేశారు. దీంతో మూడు వన్డేల సిరిస్‌ను 1-0తో ఇంగ్లాండ్ ఆధిక్యంలో నిలిచింది. భారత బౌలర్లలో యుజువేంద్ర చాహల్ 2 వికెట్లు తీసుకోగా, పర్వేజ్ రసూల్ ఒక వికెట్ తీసుకున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+