Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చిగుంబురా కొడితే స్టేడియం అవతల బంతి: హైలెట్స్

హరారే: జింబాబ్వే-భారత్‌ల మధ్య హరారేలో శనివారంనాడు జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో ఆతిధ్య జట్టు పరుగుల వరద పారించింది. భారత బౌలర్ ఉనద్కత్ బౌలింగ్‌ 19 ఓవర్‌లో జింబాబ్వే బ్యాట్స్‌మన్ చిగుంబురా బంతిని ఉతికి ఆరేశాడు. ఏకంగా రెండు సిక్సర్లు బాదేశాడు.

ఒక సిక్సర్ కొడితే బంతి వెళ్లి స్టేడియం వెలుపల పడింది. దాంతో ఉనద్కత్ గుడ్లు తేలేశాడు. ఆ తర్వాతి బంతిని జాగ్రత్తగా వెయ్యాలనుకున్నాడు. ఆ టెన్షన్‌లో రెండు వైడ్‌లు వేశాడు. మొత్తం మీద 19వ ఓవర్‌లో 21 పరుగులిచ్చాడు.

Zimbabwe

బుమ్రా రికార్డు

ఇదిలావుంటే, జింబాబ్వేతో హరారేలో జరిగిన టి20 మ్యాచ్‌లో రెండు వికెట్లు తీయడం ద్వారా బుమ్రా అరుదైన రికార్డు సాధించాడు. 2016లో టి20 మ్యాచుల్లో 50 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఒక క్యాలండర్ ఇయర్‌లో ఇలా ఈ రికార్డు సృష్టించడం చిన్న విషయమేమీ కాదు.

అక్షర్ సిక్సర్ల మోత

జింబాబ్వేతో జరిగిన తొలి టి20లో భారత్‌ను ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ దూకుడు ప్రదర్శించాడు. రెండు భారీ సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టి భారత్‌ను విజయానికి చేరువ చేశాడు. రాగానే సిక్సర్, ఫోర్ కొట్టి భారత్ ఆశల్ని సజీవంగా ఉంచాడు. ఆ తర్వాత 19వ ఓవర్‌లో మరో సిక్సర్ కొట్టాడు. 9 బంతుల్లో 18 పరుగులు చేశాడు. అయితే, ఆక్షర్ పటేల్ శ్రమ వృధా అయింది. భారత్ రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది.

వన్డేల్లో అలా... టీ20లో ఇలా...

భారత్‌తో స్వదేశంలో జరిగిన సీరీస్‌లో జింబాబ్వే వైవిధ్యమైన రికార్డును సాధించింది. భారత్‌తో మూడు వన్డేలు ఆడిన జింబాబ్వే తొలి వన్డేలో 168 పరుగులు చేసింది. రెండో వన్డేలో 126, మూడో వన్డేలో 123 పరుగులు చేసింది. 50 ఓవర్ల మ్యాచుల్లో జింబాబ్వే చేసిన స్కోర్లు అవి.

అయితే భారత్‌తోటే టి20 సీరీస్ కూడా ఆడిన జింబాబ్వే తొలి టి20 మ్యాచ్‌లో 20 ఓవర్లే ఆడి 170 పరుగులు చేసింది. వన్డేల్లో హైఎస్ట్ స్కోరు 168 కాగా, టి20లో 170 పరుగులు. టి20లపై జింబాబ్వే ఆటగాళ్ల పట్టేమిటో అది తెలియజేస్తోంది. వన్డేల్లో ఓడిపోయామేమో కానీ టి20ల్లో మాత్రం రఫ్ ఆడిస్తామని జింబాబ్వే కెప్టెన్ క్రీమర్ మ్యాచ్‌కు ముందు వ్యాఖ్యానించాడు. దాన్ని నిజం చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+